ఖరీదైన ప్రొటీన్ పౌడర్లు ఎందుకు? రోజూ గుప్పెడు ఇవి తింటే శరీరంలో ప్రోటీన్ లోపం అనేదే ఉండదు!

chicpeas benefits
మనం కాలక్షేపంగా తినే శనగల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఫాబేసి కుటుంబానికి చెందిన శనగలను పేదవాని బాదం గా పిలుస్తారు. ఎందుకంటే చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలను అందిస్తుంది.
ఖరీదైన డ్రై ఫ్రూట్స్ కన్నా తక్కువ ఖర్చులో లభ్యమయ్యే శనగల్లో పోషకాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. శనగల్లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది.
రక్తంలో చక్కర స్థాయిలు, కొవ్వు స్థాయిలను తగ్గించి ఇన్సులిన్ నిరోధకతను కూడా మెరుగ్గా నియంత్రించడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.

శనగలలో కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్, విటమిన్ Kసమృద్ధిగా ఉండటం వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకలకు సంబంధించిన సమస్యలన్నింటినీ తగ్గిస్తుంది.
శనగల్లో విటమిన్ బి 9 లేదా పోలేట్ సమృద్ధిగా ఉండటం వలన మెదడు కండరాలకు సరైన పోషణ అందించి వాటి అభివృద్ధికి సహాయపడుతుంది. అంతేకాకుండా నాడీ వ్యవస్థ బాగా పనిచేయటానికి కూడా సహాయపడుతుంది.

నీరసం, అలసట, నిసత్తివ వంటి వాటిని తగ్గించి హుషారుగా ఉండేలా చేస్తుంది. శనగల్లో ఉండే అమినో ఆసిడ్స్, సెరటోనిన్ వంటివి నిద్ర బాగా పట్టడానికి సహాయపడతాయి. నిద్రలేమితో బాధపడే వారికి శనగలు ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
శనగల్లో ఐరన్ కూడా చాలా సమృద్ధిగా లభిస్తుంది. కాబట్టి రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తుంది. వీటిలో ఉండే యంటి ఆక్సిడెంట్ శరీరాన్ని స్ట్రాంగ్ గా మార్చి ఎప్పుడు హుషారుగా ఉండేలా చేస్తుంది. కాబట్టి రోజు ఒక గుప్పెడు శనగలను తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలు ఉన్న శనగలను తీసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top