Hair growth Tips:వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడే సమస్యలలో జుట్టు రాలే సమస్య మొదటి వరుసలో ఉంటుంది. మనలో చాలామంది జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే చాలా ఎక్కువగా కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడేస్తూ వేల కొద్ది డబ్బులను ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.
అలా కాకుండా కాస్త ఓపికగా మన వంటింట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇంటి చిట్కాలను వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి.
మీడియం సైజులో ఉన్న అల్లం ముక్కను తీసుకుని శుభ్రంగా కడిగి పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్ట్ గా చేసి దాని నుంచి రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి.
ఒక బౌల్లో తయారుచేసి పెట్టుకున్న అల్లం రసం, మూడు స్పూన్ల పెరుగు, రెండు స్పూన్ల మందార పువ్వుల పొడి వేసి అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి.
ఈ పేస్ట్ ని జుట్టు మూలల నుండి చివర్ల వరకు పట్టించి అరగంట అయ్యాక కుంకుడు కాయలు లేదంటే హెర్బల్ షాంపూతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలిన ప్రదేశంలో కొత్త జుట్టు వస్తుంది.
అలాగే తెల్ల జుట్టు సమస్య కూడా తొలగిపోతుంది. మందార పూల పొడి ఆయుర్వేద షాపుల్లో, ఆన్లైన్ స్టోర్స్ లో విరివి గానే లభ్యమవుతుంది. లేదంటే మందార పువ్వులను ఎండబెట్టి పొడిగా తయారు చేసుకుని వాడుకోవచ్చు.
మందార పువ్వుల్లో విటమిన్ సి, యాంటీ ఫంగల్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషణ, బలాన్ని అందిస్తుంది. అలాగే తల మీద చర్మం ఎటువంటి ఫంగస్ లేకుండా శుభ్రంగా ఉండేలా చేస్తుంది.
ఇక అల్లం విషయానికి వచ్చేసరికి జుట్టు కుదుళ్లను ప్రేరేపించి జుట్టు రాలకుండా పెరగడానికి సహాయపడుతుంది. అల్లం లో ఫ్యాటీ ఆసిడ్స్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు సమస్యలకు చెక్ పెట్టడానికి సహాయపడుతుంది.
ఇక పెరుగును పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు.
కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా ఇప్పుడు చెప్పిన ఈ ఇంటి చిట్కాను పాలు అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే చాలా తక్కువ ఖర్చుతోనే జుట్టు రాలే సమస్యను, చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

.webp)