ఉదయం సమయంలో తీసుకునే బ్రేక్ ఫాస్ట్ అనేది మన రోజువారి జీవితం మీద కీలకమైన ప్రభావాన్ని చూపుతుంది. మంచి పోషకాలు ఉన్న బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే రోజంతా నీరసం, అలసట, నిస్సత్తువ వంటివి లేకుండా ఉషారుగా అన్ని పనులను సులభంగా చేసేసుకోవచ్చు.
ఈ మధ్యకాలంలో మనలో చాలామంది ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం ప్రారంభించారు.
అలాంటి ఆహారాలలో ఓట్స్ ఒకటి. oats ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఓట్స్ ను ఏ రూపంలో తీసుకున్న పర్వాలేదు.. ఉప్మా, కిచిడి,అట్టు ఇలా ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు.
ఓట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడుతుంది.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహించి గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
High బిపి సమస్యతో బాధపడే వారికి ఓట్స్ మంచి ఆహారం అని చెప్పవచ్చు ఎందుకంటే రక్త సరఫరా బాగా సాగేలా చేసి రక్త పోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. oats లో ఉండే ఫైబర్ జీర్ణ సంబంద సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది.
ఇక బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉండి తొందరగా ఆకలి వేయదు.
డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. ఇది రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఆస్తమా సమస్యకు కూడా చెక్ పెడుతుంది.
ఓట్స్ లో విటమిన్ బి సహజ సిద్ధంగా లభిస్తుంది. అలాగే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉండటం వలన నరాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. నీరసంగా ఉన్నప్పుడు తింటే తక్షణ శక్తి లభిస్తుంది.
బాగా నీరసంగా ఉన్నప్పుడు పాలల్లో ఓట్స్ వేసుకుని తింటే మంచి ప్రయోజనం కనబడుతుంది. కాబట్టి మనకు ఎన్నో రకాల ఓట్స్ అందుబాటులో ఉన్నాయి. oats ఉదయం బ్రేక్ఫాస్ట్ లో తిని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.
మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యం విషయంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి మంచి పాషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

