కిడ్నీ స్టోన్స్ (Kidney Stones) లేదా మూత్రపిండాల్లో రాళ్లు.. ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇది.
ఈ రాళ్లు ఏర్పడినప్పుడు వచ్చే నొప్పి భరించలేనంతగా ఉంటుంది. తగినంత నీరు తాగకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, మూత్రం ఎక్కువసేపు ఆపుకోవడం లాంటివి దీనికి ప్రధాన కారణాలు.
అయితే కిడ్నీ రాళ్లను ప్రారంభ దశలోనే సహజంగా కరిగించడానికి, భవిష్యత్తులో మళ్లీ రాకుండా నివారించడానికి కొన్ని రకాల వెజిటేబుల్ జ్యూస్‌లు (Vegetable Juices) అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
1. బూడిద గుమ్మడికాయ జ్యూస్ (Ash Gourd Juice)
బూడిద గుమ్మడి జ్యూస్ కిడ్నీలకు ఒక న్యాచురల్ మెడిసిన్ లాంటిది. ఇందులో నీటి శాతం చాలా ఎక్కువ. దీనిలో ఉండే ఆల్కలైన్ లక్షణాలు కిడ్నీల్లో ఏర్పడిన ఆక్సలేట్ రాళ్లను విచ్ఛిన్నం చేసి మూత్రం ద్వారా బయటకు పంపేస్తాయి. రోజూ ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు బూడిద గుమ్మడి జ్యూస్ తాగడం వల్ల మూత్రపిండాలు పూర్తిగా డీటాక్స్ అవుతాయి.
2. కీరదోస జ్యూస్ (Cucumber Juice)
శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచడంలో కీరదోస అద్భుతంగా పనిచేస్తుంది. కీరదోస జ్యూస్ కిడ్నీలను శుభ్రపరుస్తుంది మరియు శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. దీనివల్ల మూత్రపిండాల్లో కొత్తగా రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి, ఉన్న రాళ్లు నెమ్మదిగా కరిగిపోతాయి.
3. సొరకాయ జ్యూస్ (Bottle Gourd Juice)
సొరకాయలో ఉండే పొటాషియం, విటమిన్స్ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది. మంట, నొప్పి తగ్గుతాయి. అయితే, జ్యూస్ చేదుగా అనిపిస్తే మాత్రం దాన్ని తాగకూడదు.
4. ముల్లంగి జ్యూస్ (Radish Juice)
ముల్లంగి కిడ్నీలకు అత్యుత్తమ డీటాక్సిఫైయర్ గా పనిచేస్తుంది. ముల్లంగి జ్యూస్ తాగడం వల్ల కిడ్నీలలో పేరుకుపోయిన టాక్సిన్స్ అన్నీ ఫ్లష్ అవుతాయి. దీని ఘాటైన రుచి కారణంగా నేరుగా తాగలేకపోతే, ఇందులో కొద్దిగా క్యారెట్ జ్యూస్ కలిపి తాగవచ్చు.
ముఖ్య గమనిక: వెజిటేబుల్ జ్యూస్ లు కిడ్నీ రాళ్లను కరిగించడంలో సహాయపడినప్పటికీ, వీటికి తోడుగా రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు కచ్చితంగా తాగాలి. కిడ్నీ స్టోన్స్ సైజు పెద్దగా ఉండి, నొప్పి విపరీతంగా ఉంటే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.

