ఉడికించిన బంగాళాదుంపల తొక్క తీసేటప్పుడు చేతులు కాలుతున్నాయా?

Potatoes peel tips
బంగాళాదుంపలతో (Potatoes) చేసే వంటలు అంటే అందరికీ ఇష్టమే. ఆలు ఫ్రై, ఆలు కుర్మా, ఆలు పరాఠా... ఇలా పేరు చెబితేనే నోరూరిపోతుంది. అయితే, వీటిని వండాలంటే ముందుగా ఉడికించి తొక్క తీయాలి. వేడి వేడి బంగాళాదుంపల తొక్క తీయడం అనేది మహిళలకు రోజూ ఎదురయ్యే ఓ చిన్నపాటి పరీక్ష.
వేడి మీద తొక్క తీస్తే చేతులు కాలిపోతుంటాయి, అలాగని చల్లారే వరకు ఆగితే వంట చేయడానికి సమయం సరిపోదు. మరి ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఓ అద్భుతమైన కిచెన్ హ్యాక్ (Kitchen Hack) మీకోసం. ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అయితే, చేతులు కాలకుండా క్షణాల్లో తొక్క తీసేయవచ్చు.

ఆ సింపుల్ ట్రిక్ ఏంటంటే.. 
ముందుగా బంగాళాదుంపలను కుక్కర్‌లో లేదా గిన్నెలో మెత్తగా ఉడికించుకోవాలి.
అవి ఉడికే లోపు ఒక గిన్నెలో బాగా చల్లగా ఉన్న నీళ్లు (వీలైతే రెండు, మూడు ఐస్ క్యూబ్స్ వేసిన నీళ్లు) సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

బంగాళాదుంపలు ఉడికిన వెంటనే వేడి నీటిని వంపేసి, ఆ వేడి బంగాళాదుంపలను నేరుగా ఈ చల్లటి నీళ్ల గిన్నెలో వేయాలి.

కేవలం 10 నుంచి 15 సెకన్ల పాటు అందులో ఉంచితే చాలు. ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా వచ్చే మార్పు వల్ల తొక్క దానంతట అదే లూజ్ అవుతుంది.

ఆ తర్వాత వాటిని నీటిలోంచి బయటకు తీసి, రెండు చేతులతో పట్టుకుని కొద్దిగా నొక్కితే చాలు... తొక్క అరటిపండు వొలిచినంత సులభంగా ఊడి వచ్చేస్తుంది!
మరో బోనస్ ట్రిక్ (కత్తితో గాట్లు పెట్టడం):
బంగాళాదుంపలను ఉడకబెట్టే ముందే, వాటి మధ్యలో కత్తితో గుండ్రంగా (చుట్టూరా ఉంగరం ఆకారంలో) ఒక చిన్న గాటు పెట్టండి. ఆ తర్వాత యధావిధిగా ఉడికించండి. 

ఉడికిన తర్వాత వాటిని బయటకు తీసి, రెండు చివర్ల పట్టుకుని లాగితే తొక్క ఒకేసారి రెండు ముక్కలుగా సులభంగా విడిపోయి వచ్చేస్తుంది.

ఇంకెందుకు ఆలస్యం, రేపు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్ లోకి ఆలుగడ్డ వంటకాలు చేసేటప్పుడు ఈ సింపుల్ ట్రిక్ కచ్చితంగా ట్రై చేయండి. మీ సమయం ఆదా అవ్వడమే కాకుండా, చేతులు కాలే బాధ తప్పుతుంది!
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top