Dates for Arthritis:మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్యలలో కీళ్లవాతం, కీళ్ల నొప్పులు అనేవి ముందువరుసలో ఉంటాయి.
ఒకప్పుడు 50 ఏళ్లు వచ్చాక మోకాళ్ళ నొప్పులు అనేవి కనిపించేవి. కానీ ఈ రోజుల్లో 30 ఏళ్లకే కీళ్లు అరిగిపోయి కీళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి. అయితే మన వంటింట్లో సులభంగా అందుబాటులో ఉండే ఒక డ్రై ఫ్రూట్ తో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు.
అదే ఖర్జూరం. ఖర్జూరంలో ఉండే పోషకాలు కీళ్లవాతాన్ని తగ్గించడమే కాకుండా ఎముకలను బలంగా ఆరోగ్యంగా మార్చుతాయి. అయితే ఖర్జూరం ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖర్జూరంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వల్ల కీళ్లలో వచ్చే నొప్పులను, వాపులను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగే ఖర్జూరంలో మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం మరియు పాస్పరస్ సమృద్ధిగా ఉండటం వలన ఎముకల సాంద్రతను పెంచి ఎముకలు గుల్లగా మారి బలహీనంగా మారకుండా ఉండటానికి సహాయపడుతుంది.
ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో మూడు గింజలు తీసేసిన ఖర్జూరాలను వేసి బాగా మరిగించి ఆ పాలను రాత్రి పడుకోవడానికి ముందు తాగాలి. ఉడికిన ఖర్జూరాలను కూడా తినేయాలి. పాలల్లో ఉండే క్యాల్షియం ఖర్జూరంలో ఉండే మెగ్నీషియం కలిసి కీళ్ల మధ్య గుజ్జును పెంచి మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తాయి.
రాత్రి సమయంలో మూడు ఎండు ఖర్జూరాలను నీటిలో వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ నీటిని తాగి నానిన ఖర్జూరాలను తినాలి. ఈ విధంగా చేయడం వలన శరీరంలోని వ్యర్ధాలు బయటికి పోయి కీళ్ల వాతాన్ని కలిగించే యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి.
ఖర్జూరం పేస్టులో సొంటి పొడి కలిపి తీసుకున్న కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఖర్జూరంలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన అలసట తగ్గుతుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది.
అలసట నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. అయితే ఖర్జూరంలో సహజసిద్ధమైన చక్కెరలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఖర్జూరాలను తినాలి. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

.webp)