వేపాకు రసంలో ఈ రెండు కలిపి జుట్టుకు పెట్టండి.. ఊడే జుట్టు కూడా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది!

hair growth tips
Hair Growth Tips:మారిన జీవనశైలి పరిస్థితులు, వాతావరణ కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపం వల్ల మనలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలలో జుట్టు రాలే సమస్య కూడా ఒకటి.

కొందరికి జుట్టు విపరీతంగా ఉడిపోయి పలుచగా మారిపోతుంది. మరికొందరికి చుండ్రు సమస్య వస్తుంది. చుండ్రు సమస్య కారణంగా కూడా జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. మనలో చాలామంది ఈ సమస్యలు కనబడగానే మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడేస్తూ ఉంటారు.

అయితే ఆ ఉత్పత్తులలో రసాయనాలు ఉండటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మన ఇంట్లో దొరికే కొన్ని అద్భుతమైన పదార్థాలతో తయారు చేసుకునే ఈ రెమెడీ వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.

ఈ రెమిడి వాడితే జుట్టు రాలడం ఆగి చాలా వేగంగా పెరుగుతుంది. ఈ రేమిడి కోసం వేపాకులు, బియ్యం, విటమిన్ ఈ క్యాప్సిల్ ఉపయోగిస్తున్నాం.

ముందుగా అర కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీటిని పోసి నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత బియ్యాన్ని వడగట్టి ఆ నీటిని పక్కన పెట్టుకోవాలి.
neem leaves
ఇక ఇప్పుడు గుప్పెడు తాజా వేప ఆకులను తీసుకుని మిక్సీ జార్ లో వేసి దానిలో పైన తయారు చేసి పెట్టుకున్న బియ్యం నీటిని వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేయాలి. ఈ పేస్ట్ ని గిన్నెలో వడగట్టాలి. దీనిలో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ ఆయిల్ వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్ లో పోసి జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి చేతి వేళ్ళ సాయంతో ఐదు నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయాలి. దీనివల్ల తల మీద రక్తప్రసరణ బాగా సాగుతుంది.

ఆ తర్వాత ఒక అరగంట అలా వదిలేసి కెమికల్స్ లేని షాంపుతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది

వేపాకుల్లో యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన చుండ్రు ఇన్ఫెక్షన్ తొలగి జుట్టు కుదుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.
rice water
బియ్యం నీటిలో ఇనోసిటాల్ అనే కార్బోహైడ్రేట్ సమృద్ధిగా ఉండటం వలన దెబ్బతిన్న జుట్టును రిపేరు చేసి జుట్టుకు మంచి షైనింగ్ ఇస్తుంది.

విటమిన్ ఈ అనేది జుట్టుకు అవసరమైన యాంటీ ఆక్సిడెంట్ ను అందిస్తుంది.. జుట్టు కుదుళ్ళను ఉత్తేజపరిచి బలోపేతం చేసి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది.

మీ జుట్టు డ్రై ఎక్కువగా ఉంటే కనుక దీనిలో ఒక స్పూన్ కొబ్బరి నూనె కలపొచ్చు.

ఈ రెమిడీని వారంలో రెండుసార్లు చేస్తే చాలా మంచి ఫలితాన్ని చాలా తక్కువ సమయంలోనే పొందవచ్చు కాబట్టి మీరు ఈ రెమెడీని ట్రై చేయండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top