మారిన జీవనశైలి కారణంగా ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వెల్లుల్లి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం మనకు తెలుసు. అయితే వెల్లుల్లిని ఎలా తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయో ఈరోజు తెలుసుకుందాం.
వెల్లుల్లి ని నెయ్యిలో వేగించి తీసుకుంటే దానిలో ఉన్న ప్రయోజనాలు, గుణాలు రెట్టింపు అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వెల్లుల్లి, నెయ్యి కలిపి తీసుకుంటే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అయ్యి సీజనల్గా వచ్చే సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది.
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే పదార్థము, నెయ్యిలోని విటమిన్స్ కలిసి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి సహాయపడుతుంది. రక్తప్రసరణ మెరుగుపడి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలో బాధపడే వారికి మంచి ఔషధం అని చెప్పవచ్చు. ప్రేగులను శుభ్రపరిచి ఆకలిని పెంచుతుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.
తాజా వెల్లుల్లి రెబ్బలని తీసుకుని ఆవు నెయ్యిలో దోరగా వేగించి ప్రతిరోజు ఉదయం పరగడుపున లేదా రాత్రి పడుకోవడానికి ముందు తీసుకోవాలి. రోజులో రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే సరిపోతుంది.
ఎక్కువగా తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా మితంగా తీసుకుంటేనే ఆ ప్రయోజనాలు మనకు అందుతాయి. అయితే ఈ వెల్లుల్లి నెయ్యి కలిపి తీసుకునే ముందు ఒక్కసారి డాక్టర్ సూచన తీసుకుంటే మంచిది
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

