ఎండాకాలంలో అల్లం ఎండిపోతుందా? ఈ చిన్న ట్రిక్ తెలిస్తే 2 నెలలైనా తాజాగా ఉంటుంది!

ginger storage tipsవేసవికాలంలో కూరలను సంరక్షించడం చాలా పెద్ద పని. ముఖ్యంగా అల్లంను నిల్వ చేయాలి అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని.. అల్లం తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి తడి లేకుండా పూర్తిగా ఆరనివ్వాలి.

ఆ తర్వాత బాగా ఆరిన అల్లంను పేపర్ టవల్ లేదా మెత్తని కాటన్ వస్త్రంలో చుట్టి గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్లో నిలువ చేస్తే దాదాపుగా పది రోజుల వరకు నిల్వ ఉంటుంది

అలాగే జిప్ లాక్ బ్యాగులలో కూడా అల్లంను నిల్వ చేస్తే అల్లం తాజాగా ఉంటుంది. అల్లం ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు అల్లం నిలువ చేయడానికి ఇప్పుడు చెప్పే పద్ధతి చాలా బాగా సహాయపడుతుంది.

ginger

అల్లంను శభ్రంగా కడిగి ఆరబెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బాక్స్ లో వేసి ఫ్రీజర్ లో పెట్టాలి. లేదంటే అల్లాన్ని మిక్సీ చేసి ఐస్ క్రీళ్లలో వేసి క్యూబ్స్ గా తయారు చేయాలి. ఈ క్యూబ్స్ గడ్డకట్టిన తర్వాత ఒక జిప్ లాక్ బ్యాగ్ లో వేసి ఫ్రీజర్ లో ఉంచాలి.

వంట చేసే సమయంలో ఒక క్యూబ్ తీసుకుని వాడుకోవచ్చు. ఈ విధంగా ఫ్రీజర్ లో పెడితే దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.

అల్లం శుభ్రంగా కడిగి ఆరబెట్టి పై పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గాజు సీసాలో వేయాలి. గాజు సీసాలో అల్లం ముక్కలు మునిగే వరకు వెనిగర్ లేదా నిమ్మరసం పోసి ఫ్రిజ్లో పెట్టాలి. ఇలా చేయటం వలన అస్సలు పాడవకుండా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. 

ginger
ఒకవేళ మీకు ఫ్రిజ్ అందుబాటులో లేకపోతే ఒక వెడల్పాటి పాత్రలో ఇసుక వేసి దానిలో అల్లాన్ని కప్పి ఉంచి ప్రతిరోజు కొంచెం నీటిని పోస్తూ ఉంటే అల్లం ఎన్ని రోజులైనా తాజాగానే ఉంటుంది. ఈ చిట్కాను మన అమ్మమ్మలు ,నానమ్మలు పాటించేవారు.

కాబట్టి మీరు కూడా ఈ చిట్కాలను ఫాలో అయితే అల్లం తాజాగా ఉంటుంది. గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top