మనలో చాలామంది సరైన ఆహారం తీసుకోకపోవడం వలన ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా తొందరగా అలసిపోతూ ఉంటారు. నరాల బలహీనత, శారీరక శక్తి తగ్గడం వంటి సమస్యలు ఎక్కువగా కనబడతాయి.
ఇలాంటి సమయంలో మందుల జోలికి వెళ్లకుండా ముందుగా మన ఇంటి చిట్కాలను వాడవచ్చు. వంటింట్లో ఉన్న ఆహారాలు ఎన్నో రకాలుగా సహాయపడతాయి. ముఖ్యంగా ఓట్స్, ఎండు ద్రాక్ష కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి సంజీవినిలా పనిచేస్తుంది.
ఓట్స్ లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి సమృద్ధిగా ఉండటం వలన మనకు అవసరమైన శక్తిని తక్షణమే అందిస్తుంది. నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే కొన్ని పోషకాలు అవసరం. ఆ పోషకాలు అనేవి ఓట్స్లో చాలా సమృద్ధిగా ఉంటాయి.
ఇక ఎండుద్రాక్ష విషయానికి వచ్చేసరికి దీనిలో ఐరన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనతను తగ్గించడమే కాకుండా రక్తప్రసరణ మెరుగుదలకు సహాయపడుతుంది.
ఈ రెండింటిని కలిపి తీసుకుంటే శరీరానికి అవసరమైన మినరల్స్ అందుతాయి. దాంతో శారీరక బలహీనత తగ్గడమే కాకుండా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి, రక్తనాళాలు శుద్ధి అయ్యి రక్తం సరఫరా బాగా సాగి నరాలు బలహీనంగా లేకుండా బలోపేతం అవుతాయి.
రాత్రి సమయంలో కొన్ని ఓట్స్, ఎండు ద్రాక్షలను నీళ్లు లేదా పాలల్లో నానపెట్టాలి. మరుసటి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. ఈ విధంగా క్రమం తప్పకుండా నెల రోజులపాటు తీసుకుంటే మీ శరీరంలో మార్పులు మీరే గమనిస్తారు.
మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రోటీన్ పౌడర్స్ వాడటం కన్నా ఇప్పుడు చెప్పిన ఓట్స్ కిస్మిస్ మిశ్రమం తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

