నువ్వులను ఇలా తింటే కాళ్లు, చేతులు లాగడం మాయం.. నరాలకు జీవం వస్తుంది!

sesame seeds
Sesame Seeds Benefits:రాత్రి పడుకునే సమయంలో మనలో చాలా మందికి కాళ్లు లాగుతూ ఉంటాయి. అలాగే చేతుల్లో తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా కాసేపు కూర్చుంటేనే కాళ్లు మొద్దు భారీ పోతూ ఉంటాయి. 

ఈ సమస్యలన్నీ మనలో చాలామంది ప్రతిరోజూ ఎదుర్కొంటూనే ఉంటారు. చాలామంది ఈ సమస్యలను పెద్దగా పట్టించుకోరు. కానీ శరీరంలో క్యాల్షియం, విటమిన్ బి12, మెగ్నీషియం వంటి పోషకాలు లోపం ఉన్నప్పుడు నరాలు బలహీనంగా మారి కాళ్లు చేతులు లాగుతూ ఉంటాయి. 

అయితే ఈ సమస్యకు మన వంటింటిలో ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. అదే నువ్వులు.. నువ్వులలో ఉండే పోషకాలు నరాలకు కొత్త శక్తిని ఇవ్వటమే కాకుండా ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అయితే కాళ్లు చేతులు లాగడం తగ్గాలంటే నువ్వులను ఎలా తీసుకోవాలో ఈరోజు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
sesame seeds
నువ్వులలో క్యాల్షియం చాలా సమృద్ధిగా ఉంటుంది. పాలలో కంటే నువ్వులలోనే క్యాల్షియం శాతం ఎక్కువగా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే నువ్వులను క్యాల్షియం పవర్ హౌస్ అని చెప్పవచ్చు.

అలాగే నువ్వులలో మెగ్నీషియం, కాపర్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన నరాల వ్యవస్థను బలపరిచి శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరిచి నరాల ఒత్తిడిని మరియు కాళ్లవాపులను తగ్గించడంలో సహాయపడుతుంది.

నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులను దోరగా వేయించి ఉంచుకోవాలి. వేగించిన నువ్వులను ఒక స్పూన్ మోతాదులో తీసుకుని దానిలో చిన్న బెల్లం ముక్క కలిపి తినాలి. ఈ విధంగా ఉదయం లేదా సాయంత్రం ఏ సమయంలోనైనా తినవచ్చు.

బెల్లంలో ఉండే ఐరన్ నువ్వులలో ఉండే క్యాల్షియం కలిసి శరీరంలో రక్తాన్ని పెంచి నరాలకు బలాన్ని అందించి కాళ్లు లాగడాన్ని క్రమంగా తగ్గేలా చేస్తుంది.
Nerve weakness
రెండు స్పూన్ల నువ్వులను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నువ్వులను నీటితో సహా మిక్సీ చేసి వడకడితే నువ్వుల పాలు వస్తాయి. ఇలా తయారైన నువ్వుల పాలల్లో తేనె కలిపి తాగితే వారం రోజుల్లోనే కాళ్లు చేతులు లాగటం, నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

రాత్రి పడుకునే ముందు నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి కాళ్లు, చేతులకు కింది నుంచి పైకి మృదువుగా మసాజ్ చేస్తే నరాల్లో రక్త ప్రసరణ బాగా పెరిగి రాత్రి సమయంలో వచ్చే కాళ్ళ తిమ్మిర్లు, నొప్పులు తగ్గుతాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top