ఒకప్పుడు 50 ఏళ్లు వచ్చేసరికి కీళ్ల నొప్పులు అనేవి వచ్చేయి. కానీ ఇప్పటి రోజుల్లో 30 ఏళ్లు రాకుండానే కీళ్ల నొప్పులతో చాలా మంది బాధపడుతున్నారు.
మోకాళ్ల నొప్పులు ఉన్నప్పుడు మోకాళ్లలో కటకట శబ్దాలు రావడం, తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఇలా ఉండటానికి మోకాళ్ళ కీళ్ల మధ్య ఉండే కార్టిలేజ్ అరిగిపోవడం కారణంగా చెప్పవచ్చు.
శరీరంలో క్యాల్షియం లోపం, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు కూర్చొని ఉండటం, అధిక బరువు సమస్య, పోషకాహార లోపం వంటి అనేక రకాల కారణాలతో కీళ్ల మధ్య జిగురు తగ్గిపోయి నొప్పులు ప్రారంభం అవుతాయి. కీళ్ల మధ్య జిగురు పెరిగి నొప్పులు తగ్గడానికి ఇప్పుడు చెప్పే ఆహారాలను తింటూ ఉండాలి.
మెంతులు
కీళ్ల నొప్పులను తగ్గించడానికి మెంతులు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో అర స్పూన్ మెంతులను వేసి నానబెట్టాలి. మరసటి రోజు ఉదయం నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగాలి. మెంతులలో ఉండే యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు మోకాళ్ల నొప్పులను వాపులను తగ్గిస్తాయి.
విటమిన్ సి ఆహారాలు (Vitamin C Foods)
కీళ్ల మధ్య కార్టిలేజ్ దెబ్బ తినకుండా ఉండాలన్న కొలజాన్ ఉత్పత్తి పెరగాలన్న విటమిన్ సి చాలా అవసరం. అందువల్ల విటమిన్ సి సమృద్ధిగా ఉండే పండ్లను రోజువారి ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ (Omega-3 Fatty Acids)
కీళ్ళలో జిగురును పెంచటానికి ఒమేగా త్రి ఫ్యాటి యాసిడ్స్ చాలా బాగా సహాయపడతాయి. వారంలో రెండుసార్లు చేపలు తింటే మంచిది. అయితే శాఖాహారులు బాదం, అవిసె గింజలు, చియా సీడ్స్ వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
విటమిన్ డి, కాల్షియం (Calcium & Vitamin D)
ఎముకల బలానికి కాల్షియం ఎంత అవసరమో, అది శరీరానికి వంటపట్టటానికి విటమిన్ డీ కూడా అంతే అవసరం. రోజు ఉదయాన్నే కాసేపు ఎండలో నిలబడితే విటమిన్ డి లభిస్తుంది. అలాగే పాలు, పెరుగు, పనీర్, తోటకూర వంటి కాల్షియం సమృద్ధిగా ఉండే ఆహారాలను తీసుకోవాలి
కలబంద (Aloe Vera)
కలబందలో కీళ్ల నొప్పులను తగ్గించే లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం కలబంద జ్యూస్ తాగితే కీళ్లకు మంచి ప్రయోజనం కనబడుతుంది.
అలాగే బరువు పెరగకుండా చూసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఉండాలి. మంచి నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి.
మోకాళ్ళ నొప్పులు రాగానే కంగారు పడిపోయి పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేదు. నొప్పులను ప్రారంభ దశలో గుర్తిస్తే సహజసిద్ధమైన పద్ధతులను పాటిస్తే మోకాల్లో జిగురు పెరిగి కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు రాకుండా కూడా ఉంటాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

