Pigmentation Remedy:చాలా మంది మహిళల్లో ప్రసవం తర్వాత లేదా హార్మోన్ల అసమతుల్యత, ఎండ తీవ్రత వంటి కారణాలతో ముఖం మీద నల్లటి లేదా ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి..
వీటిని ఆయుర్వేదంలో మంగు మచ్చలు అని ఇంగ్లీషులో పిగ్మెంటేషన్ అని పిలుస్తారు. ఇలా పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు ముఖం చూడటానికి బాగోదు. అలాగే పిగ్మెంటేషన్ అనేది ముఖం అందాన్ని దెబ్బతీస్తుంది
దాంతో కొంత ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోతాం. ఫిగ్మెంటేషన్ తగ్గించడానికి మార్కెట్లో ఎన్నో రకాల క్రీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అలా కాకుండా మన వంటింట్లో దొరికే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక Cream తయారు చేసుకుని వాడితే మంగు మచ్చలు లేదా ఫిగ్మెంటేషన్ అనేది తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది.
ముందుగా ఒక బంగాళదుంపని తీసుకుని శుభ్రంగా కడిగి తురుముకోవాలి. దీని నుంచి రసాన్ని వడగట్టాలి. ఒక బౌల్ లో రెండు స్పూన్ల బంగాళదుంప రసం, రెండు స్పూన్ల అలోవెరా జెల్, పావు స్పూన్ కస్తూరి పసుపు, అర స్పూన్ బాదం నూనె వేసి క్రీమ్ లా మారేవరకు బాగా మిక్స్ చేయాలి.
ఇలా మిక్స్ చేయటానికి దాదాపుగా పావుగంట సమయం పడుతుంది. ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో భద్రపరిస్తే ఒక వారం రోజులు పాటు నిల్వ ఉంటుంది.
ఈ క్రీమ్ ని రాత్రి పడుకోవడానికి ముందు రాసి మృదువుగా మసాజ్ చేసి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు చేస్తే క్రమంగా ఫిగ్మెంటేషన్ తగ్గిపోతుంది.
బంగాళదుంప లో ఉండే కాటకోలేస్ అనే ఎంజైమ్ చర్మంపై ఉండే పిగ్మెంటేషన్ తగ్గించడానికి ఒక బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది.
కలబంద లో ఉండే అలోసిన్ అనే సమ్మేళనం చర్మం లో మేలనిన్ ఉత్పత్తిని నియంత్రించి మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. పసుపులో ఉండే యంటి ఆక్సిడెంట్స్ చర్మానికి మంచి గ్లోని ఇస్తాయి.
కాస్త ఓపికగా ఈ రెమిడిని ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా పిగ్మెంటేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

