బరువు తగ్గే ప్రణాళికలో ఉన్న వారికి జొన్న ఇడ్లీ మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఎందుకంటే జొన్నలతో చేసిన ఆహారాలలో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి.
ముఖ్యంగా డయాబెటిస్, BP ఉన్నవారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు జొన్న ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
రెండు కప్పుల జొన్నలు
అర కప్పు అటుకులు
ఒక కప్పు మినప్పప్పు
ఒక స్పూన్ మెంతులు
సరిపడా ఉప్పు
నీరు
తయారీ విధానం
జొన్నలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో పోయాలి. అదే గిన్నెలో మినప్పప్పు, మెంతులను కూడా వేసి నీటిని పోసి నానబెట్టాలి. ఒక అరగంట అయ్యాక అటుకులను కూడా వేసి నానబెట్టాలి.
నాలుగు గంటలు అయ్యాక నానిన జొన్నలు, మినప్పప్పు, అటుకులు, మెంతుల మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని 10 గంటల పాటు పులియనివ్వాలి. పిండి పులిస్తే ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. ఇడ్లీలుగా వేసుకుని తింటే సరిపోతుంది.
జొన్న ఇడ్లీలకు కొబ్బరి చట్నీ మంచి కాంబినేషన్. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో జొన్న ఇడ్లీ తింటే తొందరగా ఆకలి వేయదు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాబట్టి ఒకసారి జొన్న ఇడ్లీలను ట్రై చేయండి.. ఆ రుచికి మీరు ఫిదా అవుతారు.

