శనగలు, ఎండుద్రాక్ష.. ఈ రెండింటిలో విడివిడిగా ఎన్నో పోషకాలు ఉంటాయని మనకు తెలుసు. కానీ, ఈ రెండింటినీ కలిపి తింటే శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు అందుతాయని మీకు తెలుసా?
ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున వీటిని తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు ఇట్టే మాయం అవుతాయి. ఆ అద్భుతమైన లాభాలేంటో ఇక్కడ చూద్దాం..
ఎలా తినాలి? రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ శనగలు, 5 లేదా 6 ఎండు ద్రాక్షలు వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగుతూ.. నానిన శనగలు, ఎండుద్రాక్షలను నమిలి తినాలి.
ఇలా రోజూ తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే:
రక్తహీనతకు చెక్ (Anemia): శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు ఈ మిశ్రమాన్ని కేవలం 15 రోజుల పాటు తింటే అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. రక్తంలో హీమోగ్లోబిన్ శాతం వేగంగా పెరిగి, రక్తహీనత సమస్య శాశ్వతంగా దూరమవుతుంది.
ఇమ్యూనిటీ బూస్టర్: ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ (Immunity) బలోపేతం అవుతుంది. రోగాలతో పోరాడే శక్తి శరీరానికి అందుతుంది.
నీరసం, అలసట దూరం: ముఖ్యంగా వేసవికాలంలో చాలామంది త్వరగా అలిసిపోతుంటారు. అలాంటి వారు ఉదయాన్నే ఇది తింటే.. తక్షణ శక్తి అందుతుంది. రోజంతా యాక్టివ్ గా ఉంటారు.
కంటి చూపు మెరుగు: ఈ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి సమస్యలను దూరం చేసి, కళ్ళు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా కాపాడతాయి.
పొట్ట సమస్యలు మాయం: ఫైబర్ అధికంగా ఉండటం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు. పొట్ట క్లీన్ గా ఉంటుంది.
ముఖ్య గమనిక: ఇన్ని లాభాలు ఉన్నాయి కదా అని అతిగా తినకూడదు. రోజుకు ఒక స్పూన్ శనగలు, 5-6 ఎండు ద్రాక్షలు.. ఇలా లిమిట్ గా తీసుకుంటేనే శరీరానికి పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

