మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క (Cinnamon) ఒకటి. బిర్యానీ, నాన్ వెజ్ వంటకాల్లో మంచి సువాసన కోసం వాడే దీనిలో.. మనకు తెలియని ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి.
దీన్ని కేవలం రుచిని ఇచ్చే మసాలా దినుసుగా మాత్రమే చూస్తే పొరపాటే! సరైన పద్ధతిలో దాల్చిన చెక్కను తీసుకుంటే డయాబెటిస్ నుంచి కొలెస్ట్రాల్ వరకు ఎన్నో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
దాల్చిన చెక్కతో అద్భుతమైన ప్రయోజనాలు:
చెడు కొలెస్ట్రాల్, అధిక బరువుకు చెక్: దాల్చిన చెక్క పొడిని కొద్దిగా తేనెలో కలిపి తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ సులువుగా కరిగిపోతుంది. అంతేకాకుండా, అదనపు కొవ్వు కరిగిపోయి అధిక బరువు (Weight Loss) సమస్య నుంచి చాలా వేగంగా బయటపడొచ్చు.
మధుమేహం (Diabetes) కంట్రోల్: డయాబెటిస్ ఉన్నవారికి దాల్చిన చెక్క ఒక అద్భుతమైన ఔషధం. రోజూ ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. (గమనిక: డాక్టర్ సూచించిన మందులు వాడుతూనే ఈ సహజమైన చిట్కాను కూడా ఫాలో అవ్వాలి).
జలుబు, గొంతునొప్పి మాయం: వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు, గొంతులో నొప్పి, మంట, గరగర వంటివి తగ్గాలంటే.. టీలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగాలి. తేనెతో కలిపి తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
పొట్ట క్లీన్ - గ్యాస్ దూరం: దాల్చిన చెక్క జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది పొట్టను మొత్తం క్లీన్ చేసి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.
బీపీ, కీళ్ల నొప్పులకు ఉపశమనం: రక్తపోటును (BP) అదుపులో ఉంచడంలో దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే, వయసు పైబడిన వారిని తరచుగా వేధించే కీళ్ల నొప్పులను తగ్గించడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
మొటిమలు, మచ్చలు పరార్: ముఖంపై మొటిమలు, నల్లని మచ్చలతో బాధపడేవారు.. కొద్దిగా దాల్చిన చెక్క పొడిలో నిమ్మరసం కలిపి ఆయా ప్రదేశాల్లో రాస్తే అవి చాలా సులువుగా తగ్గిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.
రోజంతా ఫుల్ ఎనర్జీ: దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో నిస్సత్తువ, అలసట దూరమై, రోజంతా సరిపడే శక్తి (Energy) లభిస్తుంది.
దాల్చిన చెక్క ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, దీనికి వేడి చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మోతాదుకు మించి అస్సలు తీసుకోకూడదు. రోజులో కేవలం రెండు చిటికెల పొడిని మాత్రమే వినియోగించడం సురక్షితం.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

