ఈ మధ్యకాలంలో చాలామంది హెల్తీ ఫుడ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఆరోగ్యం అనగానే ఖరీదైన బాదం, పిస్తా, చియా సీడ్స్ మాత్రమే తినాలనుకుంటారు. కానీ, అతి తక్కువ ధరలో.. మనకు ఇళ్లలోనే దొరికే ఒక అద్భుతమైన సూపర్‌ఫుడ్ గురించి మీకు తెలుసా? అదే దిల్ సీడ్స్ (Dill Seeds). దీన్నే కొందరు శతపుష్పి గింజలు అని కూడా అంటారు.
రోజువారీ ఆహారంలో కేవలం అర స్పూన్ ఈ గింజలను చేర్చుకుంటే.. ఎముకల బలహీనత, రక్తహీనత, ప్రోటీన్ లోపం వంటి సమస్యలన్నీ మాయమవుతాయి.
మనలో చాలా మంది కాల్షియం అనగానే నువ్వులు లేదా పాలు తాగుతుంటారు. కానీ, వాటికంటే ఎక్కువగా దిల్ సీడ్స్‌లో కాల్షియం లభిస్తుంది. పైగా దీని ధర కూడా చాలా తక్కువ, కేజీ కేవలం రూ. 250 వరకు మాత్రమే ఉంటుంది.
ఈ గింజల్లో కేవలం కాల్షియం మాత్రమే కాదు.. శరీరం ఆ కాల్షియంను శోషించుకోవడానికి (Absorb) అవసరమయ్యే విటమిన్ సి, విటమిన్ కె కూడా పుష్కలంగా ఉన్నాయి. దీనివల్ల మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పుల సమస్యతో బాధపడేవారికి ఇది ఒక సంజీవనిలా పనిచేస్తుంది. ఎదిగే పిల్లలకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.
రక్తహీనత, మలబద్ధకానికి చెక్!
రక్తహీనత దూరం: ఇందులో ఉండే ఐరన్ (ఇనుము) కంటెంట్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని వేగంగా పెంచుతుంది. బాడీలో బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉండి, నీరసంగా ఉండేవారికి ఇది బెస్ట్ రెమెడీ.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: 21 గ్రాముల హై-ఫైబర్ ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవు. ముఖ్యంగా తీవ్రమైన మలబద్ధకం (Constipation) సమస్యతో బాధపడేవారికి ఇది పర్ఫెక్ట్ సొల్యూషన్.
దిల్ సీడ్స్ (Dill Seeds) ఎలా తినాలి?
ఈ గింజలు కమ్మటి వాసన, మంచి రుచిని కలిగి ఉంటాయి. వీటిని మీ డైట్‌లో ఇలా చేర్చుకోవచ్చు:
పొడి రూపంలో: గింజలను లైట్‌గా వేగించి పొడి చేసి పెట్టుకోండి. దీన్ని రోజూ తినే కూరల్లో, చట్నీలు లేదా సలాడ్స్‌పై చల్లుకుని తినొచ్చు.
హెల్తీ లడ్డూలు: ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్‌తో పాటు ఈ గింజలను కలిపి లడ్డూలుగా చేసుకుని రోజుకొకటి తింటే శరీరానికి ఇన్‌స్టంట్‌గా ప్రోటీన్, కాల్షియం అందుతాయి.
ఖరీదైన మందులు, సప్లిమెంట్ల కంటే.. ఇలాంటి సహజసిద్ధమైన, తక్కువ ఖర్చుతో కూడిన దేశీ గింజలను అలవాటు చేసుకుంటే హాస్పిటల్స్ చుట్టూ తిరిగే పని తప్పుతుంది!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

