ఖరీదైన క్రీమ్స్ వద్దు.. ఈ నాచురల్ జెల్ తో గ్లాస్ స్కిన్ మీ సొంతం!

flax seeds face glow
వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై ముడతలు రావడం సహజం. కానీ, ప్రస్తుత రోజుల్లో కాలుష్యం, ఒత్తిడి, నిద్రలేమి, సెల్ ఫోన్ స్క్రీన్ల వల్ల చాలా చిన్న వయసులోనే చర్మం కళావిహీనంగా మారి, ముడతలు (Wrinkles), మచ్చలు వస్తున్నాయి. 

ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన యాంటీ ఏజింగ్ క్రీమ్స్, పార్లర్ ట్రీట్మెంట్స్ వాడుతుంటారు. కానీ, మన వంటగదిలో ఉండే ఒక అద్భుతమైన గింజలతో న్యాచురల్ 'బొటాక్స్' (Botox) లాంటి రిజల్ట్ పొందవచ్చని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు.

ఆ అద్భుతం మరేదో కాదు.. అవే 'అవిసె గింజలు' (Flaxseeds). చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో, ముడతలను తొలగించడంలో అవిసె గింజలు ఒక మ్యాజిక్ లా పనిచేస్తాయి. కొరియన్లు తమ గ్లాస్ స్కిన్ (Glass Skin) కోసం ఈ అవిసె గింజలను ఎక్కువగా వాడుతుంటారు.
ఇవి చర్మంపై ఎలా పనిచేస్తాయి?
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్: అవిసె గింజల్లో ఒమేగా-3 పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని లోపలి నుంచి తేమగా (Hydrated) ఉంచుతుంది.

స్కిన్ టైటనింగ్: ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం సాగిపోకుండా టైట్ గా మారుస్తాయి. వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వవు.

మృతకణాల తొలగింపు: ముఖంపై ఉండే మృతకణాలను (Dead cells), మచ్చలను తొలగించి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి.

అవిసె గింజల జెల్ (Flaxseed Gel) తయారీ విధానం:
ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసి, అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసి సన్నని మంటపై మరిగించాలి.

నీళ్లు చిక్కబడి, గుడ్డు సొన లాగా ఒక జెల్ (Gel) లాగా మారుతున్న సమయంలో స్టవ్ ఆఫ్ చేయాలి.

జెల్ వేడిగా ఉన్నప్పుడే ఒక పల్చటి క్లాత్ (Cotton cloth) లేదా స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలి. (చల్లారితే గట్టిపడి వడకట్టడం కష్టం అవుతుంది).
ఎలా అప్లై చేయాలి? 
ముఖాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత, ఈ అవిసె గింజల జెల్ ను ముఖానికి, మెడకు అప్లై చేయాలి. 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే చర్మం టైట్ గా, కాంతివంతంగా మారుతుంది. మిగిలిన జెల్ ను ఫ్రిజ్‌లో వారం రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు.

ఈ జాగ్రత్తలు కూడా పాటిస్తేనే గ్లో వస్తుంది! కేవలం పైపూతలే కాకుండా లోపలి నుంచి కూడా కేర్ తీసుకోవాలి:

రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. హైడ్రేషన్ వల్లే సగం గ్లో వస్తుంది.

జంక్ ఫుడ్ తగ్గించి, విటమిన్ సి (నిమ్మ, నారింజ, ఉసిరి) ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలి.

కనీసం 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర చర్మానికి అత్యంత అవసరం.

వయసును దాచేయడం ఎవరి తరమూ కాదు.. కానీ చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఈ రోజు నుంచే ఈ నాచురల్ అవిసె గింజల జెల్ ట్రై చేయండి, గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం చేసుకోండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top