Godavari Surya : స్టార్ మా ‘గోదావరి’ సూర్య రియల్ లైఫ్, ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Godavari surya
Godavari Surya :స్టార్ మా ఛానల్ సీరియల్ ప్రేక్షకులను ఎప్పటికప్పుడు కొత్త కథలతో అలరిస్తోంది. గత రెండు నెలల్లోనే అనేక కొత్త సీరియల్స్ ప్రసారం కాగా.. అందులో లేటెస్ట్‌గా వచ్చిన సీరియల్ 'గోదావరి'. 

సరికొత్త కథాంశంతో మొదలైన ఈ సీరియల్ అప్పుడే బుల్లితెర ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే, ఇందులో హీరో ‘సూర్య’ పాత్రలో నటిస్తున్న కుర్రాడి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.

చూడటానికి చాలా కొత్తగా కనిపిస్తున్న ఈ సూర్య ఎవరు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి? రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు? లాంటి ఆసక్తికర విషయాలు మీకోసం..
సూర్య రియల్ లైఫ్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే..
ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై పరభాషా నటీనటుల హవా నడుస్తోంది. హీరోయిన్లు కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తుంటే.. హీరోలు మాత్రం తమిళ ఇండస్ట్రీ నుంచి దిగిపోతున్నారు.

'గుండె నిండా గుడి గంటలు' బాలు, 'పొదరిల్లు' చక్రి లాంటి వాళ్లంతా కోలీవుడ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినవారే. ఇప్పుడు అదే లిస్టులోకి 'గోదావరి' హీరో కూడా చేరిపోయాడు.

గోదావరి సీరియల్ లో సూర్యగా నటిస్తున్న ఈ యువ నటుడి అసలు పేరు మారన్ చంద్రశేఖరన్ (Maran Chandrasekaran).

తమిళంలో ఇప్పటికే పలు హిట్ సీరియల్స్ లో నటించిన మారన్‌కు.. తెలుగులో మాత్రం ఇదే మొదటి ప్రాజెక్ట్.
తొలి సీరియల్ తోనే తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇదే ఫాలోయింగ్ కంటిన్యూ చేస్తే అతి త్వరలోనే స్టార్ హీరోల రేసులో నిలవడం ఖాయం అంటున్నారు ప్రేక్షకులు.

రెమ్యూనరేషన్.. ఒక్క రోజుకు ఇన్ని వేలా?
తెలుగు హీరోల కంటే ఇతర ఇండస్ట్రీల నుంచి వచ్చే నటీనటులకు ఇక్కడ డిమాండ్ ఎక్కువగానే ఉంటోంది. ఈ క్రమంలోనే కోలీవుడ్ నుంచి వచ్చిన మారన్ చంద్రశేఖరన్ కూడా తొలి సీరియల్ కే భారీగా పారితోషికం అందుకుంటున్నాడు.

బుల్లితెర వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సీరియల్ కోసం సూర్య ఒక్కో రోజుకు ఏకంగా రూ. 35 వేలకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

నెలలో దాదాపు 30 రోజుల పాటు షూటింగ్ ఉంటుందని లెక్కేసుకున్నా.. నెలకు లక్షల్లోనే సంపాదిస్తున్నాడు.

ఒక పక్క తమిళంలో, మరో పక్క తెలుగులో సీరియల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ హీరో.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడు. 

తన షూటింగ్ విశేషాలతో పాటు, లేటెస్ట్ ఫోటోషూట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ మరింత క్రేజ్ పెంచుకుంటున్నాడు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top