కీళ్ల మధ్య గుజ్జు అరిగిపోయిందా? రోజూ 'ఈ' జ్యూస్ 1 గ్లాసు తాగితే కీళ్లకు గ్రీజులా పనిచేస్తుంది!

Joint pains juice
వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య.. కీళ్ల నొప్పులు (Joint Pains). మెట్లు ఎక్కాలన్నా, కింద కూర్చొని లేవాలన్నా నరకం కనిపిస్తుంది. 

మారిన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం వల్ల ఎముకల మధ్య ఉండే కార్టిలేజ్ (Cartilage) అరిగిపోయి, జిగురు తగ్గడమే దీనికి ప్రధాన కారణం.

దీనివల్ల మోకాళ్లు మడిచినప్పుడు 'టక్ టక్' అని శబ్దాలు రావడం, విపరీతమైన నొప్పి వస్తుంటాయి. అయితే, ఒక అద్భుతమైన పండుతో ఈ సమస్యకు న్యాచురల్ గా చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఆ సంజీవని ఏంటంటే? అది మరేదో కాదు.. 'దానిమ్మ' (Pomegranate). కీళ్ల నొప్పులను తగ్గించడంలో, ఎముకల మధ్య వశ్యత (Flexibility) పెంచడంలో దానిమ్మ ఒక న్యాచురల్ పెయిన్ కిల్లర్ లా పనిచేస్తుంది.
ఎముకల మధ్య 'గ్రీజు'లా ఎలా పనిచేస్తుంది? దానిమ్మలో 'ప్యూనికాలజిన్స్' (Punicalagins), 'ప్యూనిక్ యాసిడ్' (Punicic acid) అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి.

ఇవి కీళ్ల మధ్య ఉండే కార్టిలేజ్ దెబ్బతినకుండా కాపాడతాయి.

కార్టిలేజ్ కు హాని చేసే ఎంజైమ్‌లను అడ్డుకుంటాయి.

ఎముకల మధ్య గ్రీజు పెట్టినట్లు జిగురును ఉత్పత్తి చేసి, కీళ్ల కదలికలను సులువు చేస్తాయి. దీనివల్ల కీళ్ల నొప్పులు, శబ్దాలు తగ్గిపోతాయి.

ఎలా తీసుకోవాలి? 
మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు ప్యూర్ దానిమ్మ జ్యూస్ (చక్కెర లేకుండా) తాగడం అలవాటు చేసుకోండి. లేదా ఒక కప్పు దానిమ్మ గింజలను నేరుగా తిన్నా అద్భుతమైన ఫలితం ఉంటుంది. 
కుటుంబంలో ఎవరికైనా కీళ్ల నొప్పుల సమస్య ఉంటే, భవిష్యత్తులో మీకు రాకుండా ఉండటానికి ఇప్పటి నుంచే దానిమ్మను డైట్‌లో చేర్చుకోవడం బెస్ట్.

ఈ జాగ్రత్తలు కూడా తప్పనిసరి! కేవలం జ్యూస్ తాగడమే కాకుండా కొన్ని ఆహార నియమాలు కూడా పాటించాలి:

ఆహారంలో ఉప్పు (Salt) వాడకాన్ని బాగా తగ్గించాలి. ఉప్పు కీళ్ల వాపును పెంచుతుంది.

జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ కు పూర్తిగా దూరంగా ఉండాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.

కీళ్లు బిగుసుకుపోకుండా ఉండాలంటే రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ లేదా వ్యాయామం చేయాలి.

సో, ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజు నుంచే మీ డైట్ లో దానిమ్మను చేర్చుకోండి, కీళ్ల నొప్పులకు గుడ్ బై చెప్పండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top