ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, మొబైల్ ఫోన్ల వాడకం, పని ఒత్తిడి వల్ల చాలా మందికి నిద్ర కరువైంది. రాత్రంతా పక్క మీద అటూ ఇటూ దొర్లుతున్నా నిద్ర రావడం లేదా? అయితే వెంటనే నిద్రమాత్రల జోలికి వెళ్లకండి.
మన ఇంట్లోనే సులభంగా దొరికే వస్తువులతో తయారుచేసుకునే ఈ అద్భుతమైన చిట్కాతో నిద్రలేమి సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు.
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 7 నుండి 8 గంటల నిద్ర తప్పనిసరి. నిద్ర సరిగా లేకపోతే ఎన్నో శారీరక, మానసిక సమస్యలు చుట్టుముడతాయి.
అలసట, బద్ధకం, ఏ పని మీద ఏకాగ్రత లేకపోవడం.
చికాకు, అధిక ఒత్తిడి.
గ్యాస్ట్రిక్, జీర్ణ సంబంధిత సమస్యలు.
డిప్రెషన్, యాంగ్జైటీ వంటి తీవ్రమైన మానసిక సమస్యలు.
గాఢ నిద్ర కోసం 'మ్యాజిక్ పొడి' -
కావాల్సిన పదార్థాలు
సహజసిద్ధమైన పోషకాలతో నిద్రను ప్రేరేపించే ఈ పొడిని తయారుచేసుకోవడం చాలా సులభం. దీనికి కావాల్సినవి:
గసగసాలు: 50 గ్రాములు
గుమ్మడి గింజలు: 50 గ్రాములు
ఎండు ఖర్జూరం: 150 గ్రాములు
తయారీ విధానం
ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి బాదం పప్పు, గసగసాలు, గుమ్మడి గింజలను విడివిడిగా దోరగా (డ్రైగా) వేయించుకోవాలి.
అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి.
ఎండు ఖర్జూరంలోని గింజలు తీసేసి, చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని కూడా మిక్సీ పట్టి పొడి చేయాలి.
ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని బాదం పొడి, గసగసాల పొడి, గుమ్మడి గింజల పొడి, ఖర్జూరం పొడి.. అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. గమనిక: ఈ పొడిని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే 15 రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటుంది.
ఎలా వాడాలి?
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు, ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో ఒక స్పూన్ ఈ పొడిని కలుపుకుని తాగాలి.
ఈ పొడిలో ఉండే అద్భుతమైన పోషకాలు మీ మెదడును, నరాలను ప్రశాంతంగా ఉంచి ఒత్తిడిని తగ్గిస్తాయి. వరుసగా ఒక వారం రోజుల పాటు ఇలా చేస్తే చాలు.. పక్క మీద వాలగానే క్షణాల్లో ప్రశాంతమైన గాఢ నిద్ర పడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజే తయారుచేసుకుని వాడి చూడండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

