రోజూ ఉదయం ఈ పాలు 7 రోజులు తాగితే చాలు.. కీళ్ల నొప్పులు, కొలెస్ట్రాల్, నిద్రలేమి మాయం!

Joint pains milk
మారుతున్న జీవనశైలి, వాతావరణ మార్పుల కారణంగా చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, నిద్రలేమి, చెడు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు పలకరిస్తున్నాయి. 

ప్రతి చిన్న సమస్యకు మందుల మీద ఆధారపడే బదులు, మన వంటగదిలో ఉండే సహజసిద్ధమైన వస్తువులతోనే అద్భుతమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. 
నరాలకు బలాన్నిచ్చి, వందేళ్లు వచ్చినా మోకాళ్ళ నొప్పులు రాకుండా చేసే ఒక పవర్‌ఫుల్ న్యాచురల్ రెమెడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దీని కోసం మనకు కేవలం మూడు పదార్థాలు ఉంటే సరిపోతుంది.

కావలసిన పదార్థాలు:
పాలు - 1 గ్లాసు
వాల్ నట్స్ (ఆక్రోట్) - 3
నల్ల ఎండు ద్రాక్ష (డ్రై బ్లాక్ కిస్మిస్) - 5
బెల్లం - కొద్దిగా
తయారీ విధానం ఇలా:
ముందుగా రాత్రి పడుకునే సమయంలో ఒక గిన్నెలో 5 నల్ల ద్రాక్ష, 3 వాల్ నట్స్ వేసి తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు ఉదయం నానిన వాల్ నట్స్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక గిన్నెలో గ్లాసు పాలు పోసి వేడి చేయాలి.

పాలు కాస్త వేడెక్కాక అందులో కట్ చేసిన వాల్ నట్స్ ముక్కలు, నానబెట్టిన ఎండు ద్రాక్ష వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా మరిగించాలి.

చివరగా కొద్దిగా బెల్లం వేసి.. ఒక నిమిషం ఆగి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే బలాన్నిచ్చే పాలు రెడీ!
ఈ పాలు తాగితే కలిగే అద్భుత లాభాలు:
నొప్పులకు చెక్: ఈ పాలను తాగడం వల్ల శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పి దరిచేరవు.

నరాలకు బలం: నరాల బలహీనత, కంటి చూపు మందగించడం, రక్తహీనత (ఎనీమియా) వంటి సమస్యలు ఇట్టే మాయమవుతాయి.

గుండె భద్రం: శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది బాగా సహాయపడుతుంది.
ఒత్తిడి, నిద్రలేమి దూరం: ఉదయం పూట ఈ పాలు తాగితే రోజంతా ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటారు. రాత్రిళ్లు నిద్రపట్టని వారికి ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది.

రోగనిరోధక శక్తి: శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ బలంగా తయారవుతుంది, తద్వారా సీజనల్ వ్యాధులు దరిచేరవు.

ఎలా తాగాలి? ఈ పాలను ఉదయం లేదా సాయంత్రం సమయంలో గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగవచ్చు. వరుసగా 7 రోజుల పాటు ఈ పాలను తాగి, ఒక వారం గ్యాప్ ఇవ్వాలి. 

ఆ తర్వాత మళ్లీ మరో వారం రోజుల పాటు తాగాలి. ఇలా చేస్తే అద్భుతమైన ఫలితం మీకే కనిపిస్తుంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా ఈ పాలను నిరభ్యంతరంగా తాగవచ్చు.

గమనిక: ఇంకెందుకు ఆలస్యం, నేటి నుంచే ఈ సింపుల్ రెమెడీని ఫాలో అయిపోయి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top