ఇంట్లో బట్టలు ఇస్త్రీ (ఐరన్) చేసేటప్పుడు ఒక్కోసారి వేడి ఎక్కువై బట్టలు కాలిపోతుంటాయి. ఆ మసి, నల్లటి మరకలు ఐరన్ బాక్స్‌కు అతుక్కుపోతాయి. ఆ తర్వాత వేరే బట్టలు ఐరన్ చేసినప్పుడు ఆ మరకలు వాటికి కూడా అంటుకుని విలువైన దుస్తులు పాడవుతాయి.
ఈ మరకలను వదిలించడానికి చాలామంది ఎన్నో రకాలుగా కష్టపడుతుంటారు. కానీ, మీ ఇంట్లో ఉండే ఈ చిన్న వస్తువులతోనే కేవలం 2 నిమిషాల్లో ఆ మరకలను సులభంగా వదిలించుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూద్దాం..
1. వెనిగర్‌తో మ్యాజిక్ ఐరన్ బాక్స్‌కు అంటుకున్న మరకలను, గీతలను తొలగించటానికి వైట్ వెనిగర్ అద్భుతంగా పనిచేస్తుంది. కొద్దిగా వైట్ వెనిగర్‌ను వేడి చేసి, అందులో ఒక క్లాత్‌ను ముంచి ఐరన్ బాక్స్ ప్లేట్‌ను గట్టిగా తుడవాలి. మరకలు పోయాక, మామూలు నీటిలో ముంచిన మరో క్లాత్‌తో ఐరన్ బాక్స్‌ను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
2. మొండి మరకలకు బేకింగ్ సోడా ఒకవేళ మరకలు ఇంకా పోకపోతే.. వెనిగర్‌లో కొద్దిగా ఉప్పు లేదా బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో మరకలు ఉన్న ప్రదేశంలో రుద్దితే ఎంతుటి మొండి మరకలైనా ఇట్టే వదిలిపోతాయి.
3. హైడ్రోజన్ పెరాక్సైడ్ ట్రిక్ మెడికల్ షాపుల్లో దొరికే హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా దీనికి బాగా సహాయపడుతుంది. ఒక క్లాత్‌ను హైడ్రోజన్ పెరాక్సైడ్‌లో ముంచి, వేడిగా ఉన్న ఐరన్ బాక్సుతో దానిపై రుద్దితే మరకలు చాలా సులభంగా మాయమవుతాయి.
4. ఉప్పుతో అద్భుతం ఐరన్ బాక్స్‌ను క్లీన్ చేయడానికి ఉప్పు బెస్ట్ ఆప్షన్. ఒక మృదువైన క్లాత్ మీద ఒక గ్లాసు ఉప్పును మందపాటి పొరలా పోయాలి. ఆ తర్వాత ఐరన్ బాక్స్‌ను 'మ్యాగ్జిమమ్ హీట్' లో పెట్టి వేడి అయ్యాక దాన్ని ఆ ఉప్పుపై రుద్దండి. ఇలా చేయడం వల్ల అంటుకున్న నల్లటి మరకలు మొత్తం ఊడిపోతాయి. ఐరన్ బాక్స్ పూర్తిగా చల్లారాక ఒక పాత గుడ్డతో ప్లేట్‌ను తుడిచేస్తే సరి.
గమనిక: ఇంకెందుకు ఆలస్యం, మీ ఐరన్ బాక్స్ కూడా ఇలాగే పాడై ఉంటే వెంటనే ఈ టిప్స్ ట్రై చేసి చూడండి. తక్కువ ఖర్చుతో పాత ఐరన్ బాక్స్ కొత్తదిలా మెరిసిపోతుంది!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

