Stevia Leaves:నేటి రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో డయాబెటిస్ (మధుమేహం) ఒకటి. ఒక్కసారి ఈ సమస్య వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే అని చాలా మంది భావిస్తారు.
ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు స్వీట్లకు, కాఫీ, టీలలో వేసుకునే పంచదారకు పూర్తిగా దూరంగా ఉండాలి. అయితే, తీపిని వదులుకోలేక ఇబ్బంది పడేవారికి ప్రకృతి ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చింది.
అదే మధుపత్రి (స్టివియా) ఆకులు. పంచదారకు బదులుగా ఈ ఆకులను వాడితే కలిగే లాభాలు తెలిస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు.
ఈ మధుపత్రి మొక్క పూర్తిగా తులసి జాతికి చెందినది. ఈ మొక్క ఆకులు సాధారణ పంచదార కంటే 30 రెట్లు ఎక్కువ తీపిని కలిగి ఉంటాయి. ఈ ఆకును నోట్లో వేసుకుని చప్పరిస్తే అచ్చం పిప్పర్‌మెంట్ బిల్లలాగా ఎంతో రుచిగా ఉంటుంది.
ఈ ఆకులతో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు:
డయాబెటిస్ నియంత్రణ: డయాబెటిస్‌తో బాధపడేవారు ప్రతిరోజూ ఈ స్టివియా ఆకులను నమిలి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
చక్కెరకు బెస్ట్ ఆల్టర్నేటివ్: ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసి పంచదారకు బదులుగా వాడుకోవచ్చు. ఈ ఆకుల పొడి ఒక స్పూన్.. ఒక కప్పు సాధారణ పంచదారతో సమానం. కాబట్టి షుగర్ ఉన్నవారు ఎలాంటి భయం లేకుండా దీనిని తీపి కోసం వాడుకోవచ్చు.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్, యాంటి ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇమ్యూనిటీని (రోగనిరోధక శక్తిని) అమాంతం పెంచుతాయి.
నోటి దుర్వాసనకు చెక్: నోటి దుర్వాసన సమస్యతో ఇబ్బంది పడేవారికి ఈ ఆకులు బెస్ట్ మౌత్ ఫ్రెష్‌నర్‌గా పనిచేస్తాయి.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ఈ ఆకులను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. ఫలితంగా గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావు.
రక్తపోటు అదుపులో: మధుమేహంతో పాటు శరీరంలో రక్తపోటును (బీపీ) కూడా నియంత్రణలో ఉంచడానికి ఈ ఆకులు సహాయపడతాయి.
ఎలా ఉపయోగించాలి?
ఈ ఆకులను నేరుగా నమిలి తినవచ్చు. లేదా ఈ ఆకులను బాగా ఆరబెట్టి పొడి చేసుకొని, గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఆ తర్వాత ప్రతిరోజూ పంచదారకు బదులుగా ఈ పొడిని కాఫీ, టీలలో వాడుకోవచ్చు.
గమనిక: ఈ మధుపత్రి ఆకులను మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకునే ముందు ఒకసారి ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించడం ఎంతో మంచిది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

