బిర్యానీలో అయినా, పాయసంలో అయినా 'యాలకులు' (Cardamom) పడితేనే ఆ రుచి, సువాసన అద్భుతంగా ఉంటాయి. అందుకే యాలకులను 'సుగంధ ద్రవ్యాల రాణి' అంటారు. అయితే, ఇవి కేవలం వంటల రుచిని, నోటి దుర్వాసనను పోగొట్టడానికే కాకుండా, మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.
ఆయుర్వేదంలో యాలకులకు ఉన్న ప్రాధాన్యత తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. రోజూ రెండు యాలకులు తింటే కలిగే అద్భుత ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం.
గ్యాస్, కడుపు ఉబ్బరానికి చెక్: తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకంతో బాధపడుతున్నారా? అయితే భోజనం తర్వాత ఒక యాలక్కాయను నమిలి తినండి. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైమ్‌లను ఉత్పత్తి చేసి పొట్టను వెంటనే తేలికపరుస్తుంది.
గుండె పదిలం - బీపీ కంట్రోల్: యాలకుల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును (BP) అదుపులో ఉంచడమే కాకుండా, రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.
ఒత్తిడి, డిప్రెషన్ మాయం: పని ఒత్తిడి, టెన్షన్ లేదా డిప్రెషన్‌గా అనిపించినప్పుడు ఒక యాలక్కాయను నోట్లో వేసుకుని చప్పరించండి. లేదా వేడిగా యాలకుల టీ తాగండి. ఆ సువాసనకు మీ మూడ్ వెంటనే మారిపోయి రిలాక్స్‌గా ఫీల్ అవుతారు.
శ్వాసకోశ సమస్యలకు విరుగుడు: దగ్గు, ఆస్తమా, శ్వాస ఆడకపోవడం, గురక వంటి సమస్యలతో బాధపడేవారికి ఆకుపచ్చ యాలకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి శ్వాసనాళాలను క్లియర్ చేసి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
నిద్రలేమికి (Insomnia) మందు: రాత్రిళ్లు నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటే.. పడుకునే అరగంట ముందు రెండు యాలకులను దంచి, నీటిలో మరిగించి వడకట్టి ఆ గోరువెచ్చని నీటిని తాగండి. వారం రోజుల్లోనే ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది.
ఆరోగ్య చిట్కా: రోజూ రాత్రి నిద్రపోయే ముందు రెండు యాలకులను బాగా నమిలి మింగి, ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగితే శరీరంలోని వ్యర్థాలు (Toxins) సులభంగా బయటకు పోతాయి. మరుసటి రోజు ఉదయం చాలా యాక్టివ్‌గా ఉంటారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

