ఉరుకులు పరుగుల జీవితం, నిద్రలేమి, వర్క్ టెన్షన్, గంటల తరబడి మొబైల్స్, ల్యాప్‌టాప్స్ ముందు కూర్చోవడం.. ఇవన్నీ తలనొప్పికి ప్రధాన కారణాలు. తలనొప్పి వస్తే ఏ పనిమీదా ఏకాగ్రత ఉండదు.
ఇక సైనస్, మైగ్రేన్ వంటివి అయితే ప్రాణం తీసేస్తుంటాయి. ఇలాంటి సమయంలో చాలామంది వెంటనే పెయిన్ కిల్లర్స్ (టాబ్లెట్లు) వేసుకుంటారు. కానీ, ప్రతి చిన్నదానికీ మందులు వాడటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
అయితే, మీ వంటగదిలో ఉండే కేవలం రెండు వస్తువులతో ఎంతటి తలనొప్పినైనా చిటికెలో మాయం చేసే అద్భుతమైన డ్రింక్ తయారుచేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి.
గోరువెచ్చని నీరు: 1 గ్లాసు
మిరియాలు: 4 (అప్పటికప్పుడు దంచుకున్నవి)
నిమ్మకాయ: సగం చెక్క
ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోండి.
అందులో అప్పటికప్పుడు దంచిన మిరియాల పొడిని వేయండి. (బయట మార్కెట్లో కొన్న మిరియాల పొడి కంటే, అప్పటికప్పుడు మిక్సీలో లేదా రోట్లో దంచుకున్న పొడి అయితేనే తలనొప్పిపై ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది).
ఆ తర్వాత అందులో సగం నిమ్మకాయ రసాన్ని పిండి, బాగా కలపండి.
ఈ డ్రింక్‌ను గోరువెచ్చగా ఉన్నప్పుడే టీ తాగినట్లు నెమ్మదిగా తాగేయాలి.
తక్షణ ఉపశమనం: తలనొప్పి మొదలైన వెంటనే ఈ డ్రింక్ తాగితే నిమిషాల్లోనే అద్భుతమైన ఉపశమనం కలుగుతుంది. బరువుగా ఉన్న తల తేలికపడుతుంది.
సైనస్, మైగ్రేన్ కంట్రోల్: మిరియాలు, నిమ్మకాయలోని ఔషధ గుణాలు సైనస్ వల్ల వచ్చే బ్లాక్స్‌ను క్లియర్ చేసి, తలనొప్పిని తగ్గించడంలో చాలా చురుగ్గా పనిచేస్తాయి.
రోగనిరోధక శక్తి (Immunity): రోజూ మనం వాడే నిమ్మ, మిరియాలు ఈ సీజన్‌లో రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుతాయి.
ఇతర సమస్యలు దూరం: వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు, గొంతునొప్పి, దగ్గు వంటివి కూడా ఈ డ్రింక్ తాగడం వల్ల ఇట్టే తగ్గిపోతాయి.
ముఖ్య గమనిక: తలనొప్పి కాస్త తక్కువగా ఉన్నప్పుడు, లేదా మొదలవుతున్న దశలో ఉన్నప్పుడు ఈ ఇంటి చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ నొప్పి భరించలేనంత తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించి టాబ్లెట్ వేసుకోవడం ఉత్తమం.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

