కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నారా? ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు.. రాళ్లు ఇట్టే కరిగిపోతాయి!

kidney stones
మన శరీరంలో 24 గంటలు విరామం లేకుండా పనిచేసే అతి ముఖ్యమైన అవయవం కిడ్నీలు. ఇవి శరీరంలోని వ్యర్థాలను, విష పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరం మొత్తం యాక్టివ్‌గా ఉంటుంది. 

అయితే, మారిన జీవనశైలి, నీళ్లు తక్కువగా తాగడం వల్ల వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది 'కిడ్నీలో రాళ్ల' (Kidney Stones) సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

చిన్న రాళ్లు అయితే మూత్రం ద్వారా సులభంగా బయటకు వచ్చేస్తాయి. కానీ రాళ్లు పెద్దవిగా ఉన్నప్పుడు మాత్రం భరించలేని నరకం కనిపిస్తుంది.
కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలిపే ప్రధాన లక్షణాలు:
మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన మంట, నొప్పి

విపరీతమైన నడుం నొప్పి (వెనుక భాగంలో)

జ్వరం రావడం, మూత్రంలో రక్తం పడటం

పదే పదే మూత్రానికి వెళ్లాలనిపించడం

ఈ లక్షణాలు కనిపించిన వెంటనే అశ్రద్ధ చేయకూడదు. డాక్టర్ సలహాతో పాటు మన ఇంట్లో సులభంగా చేసుకునే ఒక అద్భుతమైన జ్యూస్ తాగితే చాలా త్వరగా రిజల్ట్ ఉంటుంది.
కిడ్నీ రాళ్లను ఇట్టే కరిగించే ఆ అద్భుతమైన జ్యూస్ ఏంటంటే?

అదే 'అరటి దూట' (Banana Stem) జ్యూస్. కిడ్నీలో రాళ్లను కరిగించడంలో, కిడ్నీలను శుభ్రపరచడంలో అరటి దూట సంజీవనిలా పనిచేస్తుంది. పల్లెటూళ్లలో ఇది విరివిగా దొరుకుతుంది, ఇప్పుడు పట్టణాల్లోని కూరగాయల మార్కెట్లలో కూడా సులభంగా అందుబాటులో ఉంటోంది.
ఎలా తయారు చేసుకోవాలి? (తయారీ విధానం)
ముందుగా అరటి దూటను తీసుకుని దాని పైన ఉండే పొరను తీసేసి, లోపలి భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఒక అరకప్పు అరటి దూట ముక్కలను మిక్సీ జార్‌లో వేయాలి.

అందులో కొద్దిగా రాళ్ల ఉప్పు (Rock Salt - సైంధవ లవణం), ఒక గ్లాసు నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టాలి.

ఆ తర్వాత ఈ జ్యూస్‌ను ఒక గ్లాసులోకి వడకట్టుకోవాలి. అంతే అద్భుతమైన ఔషధం రెడీ!

ఎలా తాగాలి? ఈ అరటి దూట జ్యూస్‌ను ప్రతిరోజూ ఉదయం అరగ్లాసు మోతాదులో (కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా) తాగుతూ ఉంటే.. కిడ్నీలో ఉన్న రాళ్లు క్రమంగా కరిగి మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి. కిడ్నీ సమస్యలు తగ్గిపోతాయి.

చిన్న గమనిక: అరటి దూట జ్యూస్ కిడ్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే, మీకు కిడ్నీలో రాళ్లు మరీ పెద్దవిగా ఉండి, నొప్పి తీవ్రంగా ఉంటే మాత్రం కచ్చితంగా ముందుగా డాక్టర్‌ను సంప్రదించి వారి సూచనల మేరకే వ్యవహరించడం ఉత్తమం.

ఆరోగ్యమే మహాభాగ్యం! కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకుందాం. ఈ ఉపయోగకరమైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top