మనం రోజూ తాగే పాలకు ఒక అద్భుతమైన దినుసును జోడిస్తే.. అది మన శరీరానికి ఒక పవర్‌ఫుల్ మెడిసిన్ లాగా పనిచేస్తుందని మీకు తెలుసా? అదే 'కలోంజీ' (Kalonji). ఒకప్పుడు పెద్దగా తెలియని ఈ గింజలు.. ఇప్పుడు అందరి వంటగదుల్లో తప్పనిసరిగా ఉంటున్నాయి.
మారిన జీవనశైలి కారణంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. పోషకాలు నిండిన ఆహారాల కోసం వెతుకుతున్నారు. అలాంటి వారికి 'కలోంజీ పాలు' ఒక అద్భుతమైన వరం.
యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్, ఫోలిక్ యాసిడ్ వంటి ఎన్నో ఖనిజాలు కలోంజీ గింజల్లో పుష్కలంగా ఉన్నాయి.
మరి ఈ కలోంజీ పాలను ఎలా తయారుచేసుకోవాలి? వీటిని తాగడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
కలోంజీ పాలు ఎలా తయారుచేసుకోవాలి?
కలోంజీ (నల్ల జీలకర్ర) గింజలను దోరగా వేయించి, మిక్సీ పట్టి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోండి. రోజూ ఉదయం లేదా సాయంత్రం ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కేవలం పావు స్పూన్ ఈ కలోంజీ పొడిని కలుపుకుని తాగాలి.
స్టామినా పెరుగుతుంది: రోజంతా పనిచేసి అలసిపోయేవారు, తరచుగా నీరసం, నిస్సత్తువతో బాధపడేవారు ఈ పాలు తాగితే తక్షణ శక్తి (Stamina) లభిస్తుంది.
ఇమ్యూనిటీ బూస్టర్: ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుతాయి. దీంతో వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం లాంటి సీజనల్ వ్యాధులు దరిచేరవు.
రక్తహీనతకు చెక్: శరీరంలో హిమోగ్లోబిన్ (Iron) శాతాన్ని పెంచడంలో కలోంజీ అద్భుతంగా సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా మంచిది.
జీర్ణ సమస్యలు దూరం: జీర్ణక్రియను మెరుగుపరచడంలో కలోంజీ కీలక పాత్ర పోషిస్తుంది. మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఇది దూరం చేస్తుంది.
బరువు తగ్గాలనుకునేవారికి: అధిక బరువు, ఊబకాయం సమస్యతో బాధపడేవారు తమ డైట్‌లో కలోంజీ పాలను చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది మెటబాలిజంను పెంచి కొవ్వు కరిగేలా చేస్తుంది.
ముఖ్య గమనిక: కలోంజీకి శరీరంలో వేడిని పెంచే స్వభావం ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు (Pregnant women) దీనిని వాడే ముందు తప్పనిసరిగా తమ డాక్టర్‌ను సంప్రదించాలి. అలాగే, ఏ ఆరోగ్య సమస్యకైనా ఆహారపు అలవాట్లు సాయపడతాయి
కానీ, అవి మందులకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా దీర్ఘకాలిక సమస్య ఉంటే వైద్యుడి సలహా మేరకే ఈ చిట్కాలను పాటించడం సురక్షితం.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

