1 గ్లాసు కషాయం.. రక్తనాళాల్లో అడ్డంకులు మాయం! పక్షవాతం ముప్పును తప్పించే ఆయుర్వేద చిట్కా

paralysis home remedies drink
పక్షవాతం (Brain Stroke).. మనిషి జీవితాన్ని ఒక్కసారిగా కుదిపేసే భయంకరమైన సమస్య. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా, అకస్మాత్తుగా వైకల్యాన్ని తెచ్చిపెట్టి జీవితాంతం ఇతరులపై ఆధారపడేలా చేస్తుంది. మెదడుకు రక్త సరఫరా ఆగిపోవడం లేదా రక్తనాళాలు చిట్లడం వల్ల ఈ స్ట్రోక్ వస్తుంది.

అయితే, రక్తనాళాల్లో అడ్డంకులను తొలగించి, నాడీ వ్యవస్థను బలోపేతం చేసే ఒక అద్భుతమైన ఔషధం మన వంటింట్లోనే ఉంది. అదేంటో, ఆ డ్రింక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మ్యాజిక్ డ్రింక్ తయారీకి కావాల్సినవి:
పొట్టు మినపప్పు: 1 స్పూన్
అల్లం: చిన్న ముక్క (అంగుళం)
నీళ్లు: 1 గ్లాసు

తయారు చేసే విధానం:
ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీళ్లు పోయాలి.

అందులో ఒక స్పూన్ పొట్టు మినపప్పు వేయాలి.

ఆ తర్వాత అంగుళం అల్లం ముక్కను తీసుకుని, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ నీటిలో వేయాలి.

ఈ మిశ్రమాన్ని 5 నుంచి 7 నిమిషాల పాటు సన్నని మంటపై బాగా మరిగించాలి.

నీళ్లు సగం అయ్యేలా మరిగిన తర్వాత స్టవ్ ఆపి, వడకట్టుకోవాలి.
ఎలా తాగాలి? ఈ గోరువెచ్చని పానీయాన్ని ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో తాగవచ్చు.

ఈ రెండు ఇంగ్రిడియంట్స్ ఎందుకు? ఎలా పనిచేస్తాయి?
మినపప్పు మహిమ: ఆయుర్వేదంలో పక్షవాత చికిత్సకు 'పొట్టు మినపప్పు'ను విశేషంగా వాడతారు. ఇది నాడీ వ్యవస్థను బలోపేతం చేసి, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. 

ముఖ్యంగా ముఖ పక్షవాతం (Facial paralysis), పాక్షిక పక్షవాతం (Partial paralysis) తగ్గించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

అల్లం ప్రయోజనాలు: రక్తనాళాల్లో పేరుకుపోయిన అడ్డంకులను కరిగించి, మెదడుకు రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేయడంలో అల్లం ఎంతో సహాయపడుతుంది.
ముఖ్య గమనిక: పక్షవాతం వచ్చిన వారు డాక్టర్లు ఇచ్చిన ఇంగ్లీష్ మందులు (Allopathic medicines) వాడుతూనే, దానికి అదనంగా ఈ ఆయుర్వేద చిట్కాను పాటిస్తే మరింత త్వరగా కోలుకుంటారు. మందులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపకూడదు.

పక్షవాతం రాకూడదంటే ఈ 3 నియమాలు తప్పనిసరి!
కేవలం చిట్కాలు పాటించడమే కాదు, పక్షవాతం దరిచేరకుండా ఉండాలంటే మీ జీవనశైలిలో కచ్చితంగా ఈ మూడు మార్పులు చేసుకోవాలి:

కొలెస్ట్రాల్: రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

రక్తపోటు (BP): బీపీ ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. బీపీ పెరగడమే స్ట్రోక్ కి ప్రధాన కారణం.

అధిక బరువు: బరువు పెరగకుండా చూసుకోవాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం లేదా వాకింగ్ చేయాలి.

ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే.. పక్షవాతం లాంటి ప్రాణాంతక సమస్యలకు దూరంగా, ఆరోగ్యంగా జీవించవచ్చు!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top