బ్యూటీ పార్లర్ వద్దు.. ఈ 2 వస్తువులతో 60లోనూ 20లా మెరిసిపోతారు!

potato and coconut face pack
ముఖం తెల్లగా, అందంగా, కాంతివంతంగా మెరవాలని ఎవరికి ఉండదు చెప్పండి? కానీ, దీని కోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం అస్సలు లేదు. మన వంటగదిలో సహజ సిద్ధంగా దొరికే కేవలం రెండు వస్తువులతో చర్మంపై ముడతలు, మచ్చలు, మొటిమలు, పిగ్మెంటేషన్ వంటి అన్ని సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు.

ఈ నాచురల్ రెమిడీని ఎలా తయారు చేసుకోవాలో, ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:
పచ్చి కొబ్బరి
బంగాళదుంప

తయారీ విధానం:
ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి (ఎండు కొబ్బరి కంటే పచ్చి కొబ్బరి చర్మానికి చాలా మంచిది) .

ఆ తర్వాత బంగాళదుంపను తీసుకుని, పై తొక్క తీయకుండానే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ కొబ్బరి, బంగాళదుంప ముక్కలను మిక్సీ జార్‌లో వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోవాలి 

ఈ పేస్ట్ నుండి రసాన్ని (జ్యూస్‌ని) ఫిల్టర్ చేసి వేరు చేసుకోవాలి. ముఖ సౌందర్యానికి మనం ఉపయోగించేది ఈ జ్యూస్‌నే..
 
 వాడే విధానం: తయారుచేసుకున్న ఈ జ్యూస్‌ను ముఖమంతా బాగా పట్టించాలి. ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసి, ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తే చాలు.

పచ్చి కొబ్బరి: 
ఇది అద్భుతమైన సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇందులో నాచురల్ ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు విటమిన్ 'ఇ', విటమిన్ 'సి', యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 

ఇవి చర్మంపై ముడతలను తగ్గిస్తాయి. కొబ్బరిలో ఉండే లౌరిక్ యాసిడ్ మొటిమలు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ముఖంపై మురికిని పోగొట్టి చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది.

బంగాళదుంప: 
నల్ల మచ్చలు, పింపుల్స్, పిగ్మెంటేషన్ సమస్యలను తగ్గించడంలో బంగాళదుంప బెస్ట్ అని చెప్పొచ్చు. ఇందులో విటమిన్ B1, B3, B6, విటమిన్ A, విటమిన్ C లతో పాటు పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.

ఇవి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి. మనం బయట కొనే ఖరీదైన యాంటీ-ఏజింగ్ క్రీముల్లో కూడా బంగాళదుంపను వాడుతుంటారు. ఇది చర్మానికి న్యాచురల్ బ్లీచ్‌లా పనిచేస్తుంది.

ఫలితం: రెగ్యులర్ గా ఈ చిట్కాను పాటిస్తే, ముఖం మీద పేరుకుపోయిన మురికి, దుమ్ము, ధూళి అంతా తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది.

చర్మ ఛాయ మెరుగుపడి, కాంతివంతంగా మెరిసిపోతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ సులభమైన, న్యాచురల్ చిట్కాను మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి! మంచి ఫలితం మీ సొంతం అవుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top