ఆయుర్వేదంలో 'శొంఠి' (Dry Ginger) కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే దీనిని 'మహా ఔషధం' అని కూడా పిలుస్తారు. శొంఠి పొడి మనకు సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది కానీ, ఇంట్లోనే కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు జోడించి తయారు చేసుకోవడం వల్ల రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
ఇంట్లోనే శొంఠి పొడిని ఎలా తయారు చేయాలి? దాని వల్ల కలిగే అద్భుతమైన లాభాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
శొంఠి పొడి తయారీ విధానం
మన నానమ్మలు, అమ్మమ్మలు శొంఠిని నెయ్యితో వేయించేవారు. కానీ, గుండె ఆరోగ్యానికి మంచిది అని ఇక్కడ ఆలివ్ ఆయిల్ (Olive oil) వాడుతున్నాం.
ముందుగా ఒక కాస్ట్ ఐరన్ (ఇనుప) పాన్ తీసుకుని అందులో 2 స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి శొంఠి కొమ్ములను వేయించాలి. ఆలివ్ ఆయిల్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఆ తర్వాత అందులో 2 స్పూన్ల జీలకర్ర కూడా వేసి బాగా వేయించాలి.
బాగా వేగిన ఈ శొంఠి, జీలకర్ర మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి మెత్తని పౌడర్‌గా చేసుకోవాలి (సాధారణ మిక్సీ అయితే కొమ్ములను కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకుని మిక్సీ పట్టుకోండి).
ఈ పొడిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుంటే దాదాపు 2 నెలల పాటు నిల్వ ఉంటుంది .
శొంఠి పొడితో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
1. జీర్ణ సమస్యలకు చెక్ అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారు రెగ్యులర్ గా ఈ శొంఠి పొడిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.
2. జలుబు, దగ్గు, కఫం మాయం సీజన్ మారినప్పుడు వచ్చే జలుబు, దగ్గులకు శొంఠి అద్భుతంగా పనిచేస్తుంది. గొంతులో పేరుకుపోయిన కఫాన్ని కరిగించి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
3. కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం శొంఠిలో ఉండే యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పి వంటివి ఉన్నప్పుడు ఈ పొడి వాడటం వల్ల చక్కటి ఉపశమనం దొరుకుతుంది.
4. బరువు తగ్గడంలో సహాయం శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడానికి శొంఠి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో మెటబాలిజం రేటును పెంచి, మనం తిన్న ఆహారం కొవ్వుగా మారకుండా అడ్డుకుంటుంది.
5. రోగనిరోధక శక్తి (Immunity) పెంపు ఈ పొడిలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. తద్వారా సీజనల్ వ్యాధులు మన దరిచేరవు .
శొంఠి పొడిని ఎలా వాడాలి?
దీన్ని వాడటం చాలా సులభం: ఉదయం తాగే టీ లేదా కాఫీలో చిటికెడు శొంఠి పొడి కలుపుకుని తాగవచ్చు .పావు టీ స్పూన్ శొంఠి పొడిని, ఒక స్పూన్ తేనెలో కలుపుకుని నేరుగా తీసుకోవచ్చు. లేదా మనం రోజూ వండుకునే కూరల్లో కూడా కొద్దిగా వేసుకోవచ్చు.
ప్రతిరోజూ పావు నుండి అర స్పూన్ మోతాదులో ఏదో ఒక రూపంలో ఈ పొడిని తీసుకుంటే పైన చెప్పిన ఆరోగ్య లాభాలన్నీ మీ సొంతం అవుతాయి!

.webp)