మన దేశంలో తృణధాన్యాల (Millets) ట్రెండ్ మళ్లీ గట్టిగా వచ్చింది. అందులోనూ సజ్జలు (Bajra), కొర్రలు (Foxtail Millet) మన పెద్దలు ఎప్పటి నుంచో తింటున్నవే. మరి నేటి తరానికి వీటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో చూద్దాం!
| పోషకం | సజ్జలు (Bajra) | కొర్రలు (Foxtail Millet) |
| కెలొరీలు | ~361 kcal | ~331 kcal |
| ప్రోటీన్ | ~11.6 గ్రాములు | ~12.3 గ్రాములు |
| ఫైబర్ (పీచు) | ~1.2 గ్రాములు (తక్కువ) | ~8.0 గ్రాములు (చాలా ఎక్కువ) |
| ఐరన్ (ఇనుము) | చాలా ఎక్కువ (~8 మి.గ్రా) | మోస్తరుగా ఉంటుంది |
సజ్జలు: ఇవి వేడి చేసే గుణం కలిగి ఉంటాయి. శ్రమించేవారికి, శీతాకాలంలో ఒంటికి మంచి శక్తినిస్తాయి. విటమిన్ B, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల గుండెకు చాలా మంచిది.
కొర్రలు: తేలికగా అరిగిపోతాయి. వీటిలో కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా రక్తంలో కరుగుతాయి కాబట్టి సడన్ షుగర్ స్పైక్స్ రావు.
2. రక్తహీనత (Anemia) & బరువు నియంత్రణ
సజ్జలు: ఐరన్ కంటెంట్ విషయంలో సజ్జలను కొట్టేదే లేదు! రక్తం తక్కువగా ఉన్నవారు (Anemia) తమ డైట్‌లో సజ్జ రొట్టెలను చేర్చుకుంటే చాలా మంచిది.
కొర్రలు: ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొట్ట నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి అన్నానికి బ ఇది మంచి ప్రత్యామ్నాయం.
మీకు రక్తం పడాలి, ఒంటికి శక్తి కావాలి అంటే సజ్జలు బెస్ట్. అదే పొట్ట తేలికగా ఉండాలి, బరువు తగ్గాలి, డయాబెటిస్ కంట్రోల్ లో ఉండాలి అంటే కొర్రలు సూపర్ ఛాయిస్!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

