మీటింగ్‌కు ముందు........ఏం తినాలి?

సభల్లో, సమావేశాల్లో మాట్లాడే ముందు తీసుకోవాల్సిన ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండి, కొవ్వులు తక్కువగా ఉండాలి. అంటే మాంసాహారం తీసుకుంటే చేపలు, చికెన్‌లాంటివిగాని లేదా పప్పుదినుసులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని గాని తీసుకోవాలి. ఆ సమయంలో కొవ్వులు తీసుకోకుండా జాగ్రత్తపడాలి. కొవ్వు లేని మాంసాహారం లేదా పప్పుదినుసులు ఎక్కువగా ఉండే చిక్కుళ్లు, రాజ్మా, శనగల వంటి ఆహారంలో ఉండే ప్రొటీన్లలోని అమైనోయాసిడ్స్ ఏదైనా విషయాన్ని తక్షణం గుర్తుకు తెచ్చుకునే శక్తి (పవర్ టు రీకలెక్ట్)ని పెంచుతాయి.

ఇక కొవ్వులు లేకుండా ఉండటం అన్నది మీరు మందకొడిగా లేకుండా చూస్తుంది. ఒకవేళ మీటింగ్‌కు ముందు కొవ్వులు లేదా నూనెలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే అది మిమ్మల్ని చాలా మందకొడిగా, బద్దకంగా చేస్తుంది.

ఇది ట్రై చేయండి : ఏదైనా మీటింగ్ లేదా ఉపన్యాసానికి ముందు చిక్కుడు కూరతో చపాతీ లేదా చికెన్‌తో చపాతీ మంచిది.
Share on Google Plus