రాగి,ఇత్తడి చేసే మేలు మీకు తెలుసా?

శుభకార్యాలకు కళ తెచ్చే రాగి, ఇత్తడి వస్తువులు మానవుని ఆరోగ్యానికీ సాయపడుతున్నాయి. రాగి పాత్రలో ఉంచిన నీళ్లు మూడు గంటల కాల వ్యవధిలోనే క్రిమి రహితంగా మారి, వాటిని తాగే వారికి ఆరోగ్యాన్ని ఇచ్చేంతగా పరిశుద్ధత పొందుతాయి. పాత్రలలో నీటిని నిల్వ ఉంచడం వలన ఈ -కొలి బ్యాక్టీరియాలు సైతం నశించిపోతాయి. 

CLICK HERE : రమ్య కృష్ణ జీవితం గురించి తెలియని షాకింగ్ నిజాలు

ఇత్తడి పాత్రలేమో జింక్, అలాయ్ మిశ్రమంతో తయారవుతాయి. జింక్ రోగ నిరోధక శక్తిని కలిగి ఉండటంతోపాటు ప్రొటీన్స్‌ను కూడా సమకూర్చేశక్తిని కలిగి ఉంటుంది. అందువలన ఇత్తడి ఆరోగ్యప్రదాయిగా గుర్తింపు పొందింది.


Copper, brass health benefits in telugulifestyle

రాగి, ఇత్తడి వస్తువుల నుంచి వచ్చే కాంతి ఫ్రీక్వెన్సీలను నూతన సాంకేతిక పరిజ్ఞానమైన పిఐపి(పాలీకాంట్రాస్ట్ ఇంటర్‌ఫియరెన్స్ ఫోటోగ్రఫీ) అనే విధానం ద్వారా నిరూపించారు. పూణెలోని కాస్మిక్ స్పిరిచ్యువల్ ఎనర్జీ సెంటర్‌లో ఈ సదుపాయం ఉంది.ఇలా ఆధునిక పరిజ్ఞానమం కూడా రాగి, ఇత్తడి వలన కలిగే మేలును వివరిస్తూనే ఉన్నాయి. 


ఎంత రాగైనా, ఇత్తడైనా అవీ పదార్థాలే కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని శుభ్రపరుస్తుండాలి. వాతావారణంలోని తేమ మూలంగా రాగి, ఇత్తడి పాత్రలపై చేరే ఆక్సైడ్స్ పచ్చని పొర ఏర్పడటానికి కారణమవుతుంది. దీనిని ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి. గతంలో సున్నం, చింతపండు, జున్నుపాలు, బూడిద, మన్ను వంటి వాటితో రాగి, ఇత్తడి వస్తువులను శుభ్రపరిచేవారు.


ఇప్పుడు వీటి స్థానంలో మార్కెట్‌లో రాగి, ఇత్త డి వస్తువులను శుభ్రపరిచే చక్కని ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి. వాటిని ఉపయోగిస్తే రాగి, ఇత్తడి వస్తువుల మన్నిక బాగుంటుంది. చింతపండు, తదితరాల్లో ఇతర పదార్థాల్లో తగినంత యాసిడ్ ఉండదు. అలాగే మన్ను, బూడిద వంటి వాటి వలన మెరిసే వస్తువులపై గీతలు ఏర్పడతాయి. 


అందువలన దీనికి పత్యామ్నాయంగా రాగి, ఇత్తడి వస్తువులను శుభ్రపరచడానికి మార్కెట్‌లో మంచి పౌడర్లు వస్తున్నాయి. ఇవి రాగి, ఇత్తడి వస్తువులను మెరిసేలా చేస్తున్నాయి. అప్పుడు ఇంట్లో జరిగే శుభకార్యంలో వాడే వస్తువులతో పాటు మనం కూడా ఆరోగ్యంతో కళకళలాడుతాము.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top