ర‌వితేజ ఆరోగ్యంపై అనుమానాలు ?

మాస్ మహారాజ్ రవితేజ గురించి ఇప్పుడు అందరు మాట్లాడుకుంటున్నారు. ఏడాదికి రెండు సినిమాలతో అభిమానులను అలరించే రవితేజ...కొంత కాలంగా సైలంట్ గా ఉన్నాడు.

రవితేజ 'బెంగాల్ టైగర్' సినిమా విడుదల అయ్యి దాదాపుగా 8 నెలలు కావొస్తున్నా కొత్త సినిమా ఏమి సెట్స్ పైకి రాకపోవటంతో రవితేజకి ఏమైందనే అనుమానం అభిమానులను కలవర పెడుతుంది.

CLICKHERE : ఒక్క ఛాన్స్ అంటున్న మెగా డాటర్


సాధారణంగా తన సినిమా ఒకటి సెట్స్ పైన ఉండగానే మరొక సినిమాని లైన్ లో పెట్టటం అలవాటు రవితేజకి. అలాంటి రవితేజ తన కొత్త సినిమా ఏమి ప్రారంభించకపోవటంతో రవితేజ ఆరోగ్యంపై అనేక రకాల వార్తలు వినపడుతున్నాయి. 



కానీ ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం రవితేజ మరి కొన్ని రోజుల్లో ఫారన్ వెళ్లుతున్నాడట. అక్కడ ఒక రిసార్ట్ లో మరింతగా స్లిమ్ గా తయారు అవవటానికి ట్రీట్ మెంట్ తీసుకుంటుంటాడట. అందుకే తన కొత్త సినిమా కోసం గ్యాప్ తీసుకున్నాడని సమాచారం. 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top