తిరుపతి లడ్డూ ఫార్ములా తెలుసా?

సాదారణంగా మనకు లడ్డు పేరు చెప్పగానే వేంటనే టక్కున గుర్తోచ్చేది మన తిరుపతి లడ్డు.సామాన్యుల దగ్గర నుండి కోట్లకు పడగలేత్తిన భాగ్యవంతుడి వరకూ ఎంతో భక్తిభావంతో తినేది తిరుపతి లడ్డు.

లడ్డూ అంటే మన తిరుపతి లడ్డూలే.  ఆరుచి మన నాలుకను చేరుకొగానే మన మనస్సు అంతా ఒక్కసారి భక్తి భావంతో పులకరించి మైమరుస్తుంది. శ్రీవారి ప్రసాదంలో దద్దోజనం,పోంగలి వంటివి ఎన్ని రకాలు ఉన్న తిరుపతి లడ్డూ కున్న ప్రత్యేకత దేనికి లేదు. 

CLICKHERE : జబర్దస్త్ కమెడియన్ల పారితోషికం తెలిస్తే....షాక్

 పూర్వకాలం నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు పంచుతున్నా 1940 ప్రాంతంలో కళ్యాణోత్సవాలు ప్రారంభం అయినప్పుడు మనం ఇపుడు చూస్తున్న లడ్డూ తయారి మొదలైంది. దీన్ని తయారుచేయడానికి ఒక ప్రత్యేకమైన పద్దతి అనేది ఒకటి ఉంది. 

లడ్డూ తయారు చేయడానికి వాడె సరుకుల మొత్తాన్ని దిట్టం అని పిలుస్తారు.ఈ దిట్టం స్కేలును 1950లో మొదటిసారిగా రూపొందించారు. ఆ తర్వాత భక్తుల తాకిడిని బట్టి  2001లో సవరించారు.ఇపుడు ఈ స్కేలు ప్రకారమే లడ్డూలను తయారు చేస్తున్నారు.
శ్రీవారి లడ్డూ తయారిలో వాడే దిట్టంలో వాడే సరుకులు -

ఆవు నెయ్యి - 165 కిలోలు
శెనగపిండి - 180 కిలోలు
ఎండు ద్రాక్ష - 16 కిలోలు
కలకండ - 8 కిలోలు 
చక్కెర - 400 కిలోలు
యాలుకలు - 4 కిలోలు
ముంతమామిడి పప్పు -30 కిలోలు

ఈ మిశ్రమంతో దాదాపుగా 5,100 లడ్డూలు తయారవుతాయి. శ్రీవారి ఆలయం ఆగ్నేయదిక్కులో ఉన్న వంటశాలలో సుమారు 15000 వరకూ లడ్డూలు తయారవుతాయి.తొలి రోజుల్లో  లడ్డూలను కట్టెలపొయ్యి మీద తయారుచేసేవారు.

అయితే భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని లడ్డుల తయారికి యంత్రాలను ప్రవేశపెట్టారు.వీటివల్ల కొంచెం రుచి,నాణ్యత తగ్గినా గిరాకి మాత్రం తగ్గలేదు. మన లడ్డూకు పేటెంట్ హక్కు కూడా లభించింది.

ఆలయంలో లభించే లడ్డూలు మూడు రకాలు
1.ఆస్ధానం లడ్డూ - వీటిని ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా మాత్రమే తయారుచేస్తారు.ప్రత్యేక అతిధులకు మత్రమే వీటిని అందిస్తారు.
2.కళ్యాణోత్సవ లడ్డూ - దీనిని కళ్యాణోత్సవాల సమయంలో కల్యాణంలో పాల్గోనే భక్తులకు అందజేస్తారు.
3.ప్రోక్తం లడ్డూ - వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందిస్తారు. CLICKHERE : రాత్రి పడుకొనే ముందు బ్రష్ చేయటం అవసరమా?
Share on Google Plus