జన్మ రాశి ఆధారం గా వ్యక్తుల స్వరూప స్వభావాలు...

మేషం

అశ్విని 4 పాదాలు , భరణి పాదాలు, కృత్తిక 1వ పాదం

ఈ రాశివారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా నగలు, ఉంగరాలు వంటివాటిపై ఆసక్తి ఎక్కువ. వస్త్ర ధారణలోను తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. 

వీరి వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు.వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది.

మేషరాశి చెందినవారు స్వేచ్ఛాప్రియులుగాను,స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉంటారు. వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు.ధైర్యం, విచక్షణతో కష్టాలను ఎదుర్కొంటారు. వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునేవారై, స్వార్ధపరులై ఉంటారు. ఎవరైనా రెచ్చ గొడితే పనులు అర్దాంతంగా వదిలిపోయేవారయి, సహనంలేని వారుగానూఉంటారు.

మేషరాశికి చెందిన వారు లాటరీలలో పాల్గొనటం ఓ హాబీ. సవాళ్లుగా ఉన్నటువంటివాటిని తమ హాబీలుగా నిర్ణయించుకుంటారు. తమకు అత్యంత ఆసక్తిని కలిగించే ప్రతి అంశాన్నిహాబీగా స్వీకరిస్తారు. నృత్యం, సంగీతం వంటి కళలను  అభ్యసించటం కూడా హాబీగా ఉంటుంది.

ఈ రాశివారు ఎక్కువగా ఆరోగ్యంపై దృష్టిపెడతారు. వీరికి కోపం ఎక్కువ కాబట్టి చిన్నపాటి అవమానం జరిగినా తట్టుకోలేరు. దీనివల్ల వీరు ప్రతికూల సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రాశిలో కొంతమంది తప్పులు చేసినా వాటిని అంగీకరించటానికి ససేమిరా అంటారు. దానివల్ల వీరు ఆతర్వాత భారీగానే నష్టపోతారు.

మేష రాశివారు ఉదార స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ తమ లక్ష్యాన్నిపూర్తిచేసుకోవాలనే సత్ససంకల్పంతో ఉంటారు. ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వీరికి ప్రేమాభిమానాలు ఎక్కువ. అలాగే అందరినుంచి ఇదే భావాలను తిరిగి పొందుతారు.



CLICKHERE : ఒలింపిక్స్ లో క్రికెట్ ఎందుకు.....ఉండదు?


వృషభం కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు

వీరు నలుపుగా ఉండటంవల్ల చాలామంది వీరికి దూరంగా ఉంటారు. అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్దం. ప్రతిఒక్కరినీ కలుపుపోయే అలోచన వీరికి ఎప్పుడూ ఉంటుంది.

వృషభ రాశికి చెందినవారు ధృఢ సంకల్పం, కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేవరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి, అందాన్నిఆరాధించే హృదయం కలిగినవారుగా ఉంటారు. ఓర్పు, సహనాలు వీరికి భూషణాలుగా భాసిస్తాయి.

వృషభరాశికి చెందినవారు పుస్తక పఠనం, ఇతర రచనా వ్యాసాలలో పాల్గొనటం ఓ హాబీగా ఉంటుంది. అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవటానికి అహర్నిశలు కృషిచేస్తారు.

ఈ రాశివారు తమకంటూ స్వంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు. అత్యంత బద్దకస్తులు, ఎవరికి లొంగనివారుగానూ ఉంటారు. ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించటానికి వెనుకాడని వారుగా ఉంటారు.

వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవనగమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళుతుంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలం అవుతాయి. ఏదిఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం.

CLICKHERE : తొడలు రాసుకుని ఎర్రగా కందితే...ఏమి చేయాలి?


మిథునం
మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు

మిధున రాశికి చెందినవారు తేజోవంతులుగానూ, సౌందర్యవంతులుగానూ ఉంటారు. ప్రతి విషయంలోనూ సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ ఎప్పుడూ నవ్వుతూఉండే లక్షణాలతో అందరితో కలిసిపోయేవారుగా ఉంటారు.

మిధున రాశికి చెందినవారు నిదానస్తులుగానూ, నిశ్శబ్ధంగా తమ పనులు చేసుకుపోయేవారుగానూ ఉంటారు. వీరి జీవన విధానం హుందాగాను, అందరిని ఆకట్టుకునే రీతిలో, అనేక విషయాలలో పాండిత్యం కలిగి, కలివిడిగా ఉంటారు. నిరంతరం అందరితో కలిసిపోయే మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ రాశి వారు కొత్తదనాన్ని ఆహ్వానిస్తారు. సంప్రదింపులలో నైపుణ్యం కలిగి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారు.దూరదృష్టితో అందికంటె భిన్నంగా వ్యవహరిస్తారు.సమయానుకూలంగా మనస్సును మార్చుకుంటారు.

మిధునరాశికి చెందిన వారికి సినిమాలు, పుస్తకాలను చదవటం, ఈతకొట్టటం వంటి అనేకమైన అలవాట్లు కలిగి ఉంటారు. ఈ అలవాట్లతో వారు ఉన్నత స్థానానికి కూడా వెళ్లగలుగుతారు.

మిధునరాశికి చెందినవారు నిలకడగాలేని మనస్తత్వం కలిగి ఉంటారు. అదేవిధంగా కాస్తంత మోసకారి మాటలుకూడా వెలుగుచూస్తాయి. ఈ రెండు లక్షణాలు వీరిలోని ప్రధాన బలహీనతలు. ఈ లక్షణాల వల్ల కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు వీరికి అందకుండా పోతాయి.

మిధునరాశికి చెందినవారు సర్వుల అభిప్రాయాలను అంగీకరించే స్వభావం కలవారుగా ఉంటారు. ఎటువంటి గందరగోళం లేకుండా నిశ్శబ్దంగా అనుకున్నదానిని సాధించేవారుగా ఉంటారు. చంచల స్వభావం కలిగిన మిథునరాశి వారి మెప్పును పొందటం చాలా సులభం. అయితే ఇదే కారణంతో వారికి దూరం అయ్యే అవకాశం లేకపోలేదు.

CLICKHERE : మంచు లక్ష్మి పెళ్లి ఎలా జరిగిందో....తెలుసా?

కర్కాటకంపునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు

కర్కాటకరాశికి చెందినవారు సున్నితంగా ఉంటారు. అందంగానూ,ఆకర్షిణీయంగానూ ఉండే వీరు ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు. ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్షణాలను ఈ రాశివారు పుష్కలంగా కలిగి ఉంటారు.

ఈ రాశివారు ఎప్పుడూ అభద్రతాభావంతో ఉంటారు.వీరికి ఏ విషయంపై ఆసక్తి అనేది ఉండదు. వీరి మానసిక అభిప్రాయాలకు విలువ లేకుండా పోవడం జరుగతుంది. ఇతరులతో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై విభేధిస్తూ ఉంటారు. సమాజం కోసం ఎప్పుడూ ఏదో చేయాలనే ఆసక్తి వీరికి మనసులో ఉంటుంది.

కర్కాటకరాశికి చెందిన వారి అలవాట్లు విభిన్నమైన అలవాట్లను కలిగి ఉంటారు.ముఖ్యంగా కళారంగాల పట్ల అత్యంత ఆసక్తిని కలిగి ఉంటారు. నాటకాలు, పౌరాణిక ప్రదర్శనలు ఇచ్చేవారి జాబితాలో ఈ రాశికి చెందిన వారు ఉంటారు. అదే విధంగా సినిమాలలో ప్రవేశిస్తే తప్పక విజయం సాధిస్తారు.

కర్కాటరాశికి చెందినవారిలో ప్రధానమైన బలహీనత అతిగా ఆందోళన చెందటం, అత్యంత ఆవేశాన్ని ప్రదర్శించటం. ఈ రెండు గుణాల వల్ల ముందు వెనక ఆలోచచించకుండా సత్వర నిర్ణయాలు తీసుకుంటారు. క్షమాగుణంలేనివారుగా ఉండే వీరిలో పిరికితనం కూడా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలతో అస్థిర చిత్తమైన మనస్సుగలవారుగా ఉంటారు.

చంద్రగ్రహ ప్రభావం వీరిపై ఉండటం వల్ల వీరి మనస్సు క్షణక్షణానికి మారుతుంటుంది. ఈ చంచెల స్వభావం వల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వీరు స్థిరచిత్తులుగా మారక తప్పదు. ఇక అప్పట్నుంచి వీరు అనుసరించే మార్గం లాభాలను తెచ్చిపెడుతుంది.

CLICKHERE : మీ వేలిముద్రతో మీ క్యారక్టర్ తెలుసుకోవటం ఎలా?

సింహం
మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం

అందరితో కలుపుపోయే తత్వంగలవారు. పదిమందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచిచెడులను భేరీజువేసుకుని అమలు చేస్తారు.

విభిన్నతకు, ఆధునికతకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చే వీరు సినిమాలు, టీవీ, నాటక రంగాలంటే అత్యంత ఆసక్తిని కనబరుస్తారు. సదా విద్యార్థిగా ఉండటమే తమ హాబీ అని గర్వంగా చెప్పుకుంటారు.

వీరు ఇతరుల చెప్పే విషయాలను అమలు చేయటంవల్ల కొన్ని సందర్భాలలో వీరికి వారినుంచి ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. అందుకుని వారినుంచి విషయాన్ని సేకరించిన తర్వాత అనుభవ పాఠాలు జోడించి ముందుకు సాగాలి.

వీరు సాధుస్వభావం కలవారు. అందువల్ల పక్కనవారు చెప్పిన విషయాలను అనుసరిస్తారు. పరాయివారిని ఎప్పుడూ దూషించటానికి దూరంగా ఉంటారు. దీనివల్ల వీరికి లాభిస్తుంది. కొత్త వారిని ఎప్పుడూ సొంతవారిలాగే చూస్తారు.

CLICKHERE : చపాతీ మెత్తగా రావాలంటే ఏమి చేయాలి?

కన్య
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు

కన్యా రాశి వారు చామనచాయగా ఉన్నప్పటికీ వీరి భావాలు చాలా విశాలమైనవిగా ఉంటాయి. చిరునవ్వుతో సమస్యల పరిష్కిరిస్తూ ముందుకు సాగిపోతారు.

ఈ రాశి వారు దుడుకు స్వభావం కలవారై ఉంటారు. ఒక్కొక్కసారి ఇతరులను నొప్పించినప్పటికీ వారు చివరికి అర్ధం చేసుకుంటారు.

ఈ రాశి వారు రచనా రంగంలో రాణిస్తారు. పాఠకులకు మరింత దగ్గరయ్యేవిధంగా కొత్త పోకడలతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు. దీనివల్ల వీరి స్థాయి మరింత పెరుగుతుంది.

కన్యారాశికి చెందినవారిలో అతిగా విశ్లేషించేతత్వం, తొందరపాటు చర్యలు అతి పెద్ద బలహీనతలుగా ఉంటాయి. ముందు వెనుకా ఆలోచించకుండా తాము అనుకున్నదే నిజమని నమ్మే మనస్తత్వం కలిగి ఉంటారు. అదేవిధంగా తీవ్రమైన వత్తిడి, అశాంతికి గురై ఉంటారు.

CLICKHERE : మన టాలీవుడ్ స్టార్స్ హాబీలు తెలిస్తే షాక్

తుల చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు

అందరితో కలుపుపోయే తత్వంగలవారు. పదిమందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచిచెడులను భేరీజువేసుకుని అమలు చేస్తారు.

వీరి జీవితగమనాన్ని బట్టే వీరి స్వభావాన్ని అంచనా వేయవచ్చు. వీరు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తారు, ఈ చురుకు స్వభావంవల్ల ఇతరులు దృష్టి వీరిపై పడుతుంది. పెద్దలతో అనుబంధాన్ని కొనసాగిస్తారు.

వీరు సాంస్కృతిక వ్యవహారాలపై మక్కువను ప్రదర్శిస్తారు. అలాగే విదేశీ విహారం, విహార యాత్రలు వంటి వాటిపైనా ప్రత్యేక ఆసక్తిన కలిగి ఉంటారు.

తులారాశివారిలో ప్రధాన బలహీనత చపలచిత్త మనస్తత్వం. అదేవిధంగా సందిగ్ధంలో గడపటం. అతిరాజీ స్వభావంతోపాటు పోట్లాట స్వభావం వీరికి పెద్ద సమస్యలను సృష్టిస్తాయి.

అందరితో కలుపుపోయే తత్వంగలవారు. పదిమందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచిచెడులను భేరీజువేసుకుని అమలు చేస్తారు.

CLICKHERE : చిలుకూరు బాలాజీ గురించి తెలియని నిజాలు

వృశ్చికం 
విశాఖ 4వ పాదం. అనూరాధ 4 పాదాలు, జ్యేష్ట పాదాలు

వృశ్చిక రాశివారు ఆకర్షణీయమైన ఆకృతిని కలిగి ఉంటారు. మనసులోతుల్లో ఉన్న భావాలు, ఆలోచనలు... వీరి చూపులలో ప్రతిబింబిస్తాయి. అన్నిటికీ మించి వీరి ముఖ వర్చస్సు విశేషంగా ఆకర్షిస్తుంది.

ఈ రాశివారు కలుపుకుపోయే తత్వం కలవారు. చిన్నా-పెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరినీ తమవారిగా భావిస్తారు. వారికి అవసరమైన పనులు చేసి వారికి మరింత దగ్గరవుతారు.

ఈ రాశి వారు రచనా రంగంలో రాణిస్తారు. పాఠకులకు మరింత దగ్గరయ్యేవిధంగా కొత్త పోకడలతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు. దీనివల్ల వీరి స్థాయి మరింత పెరుగుతుంది.

వీరిలో ఉన్న ప్రధానమైన బలహీనతా లక్షణాలు అసూయా ద్వేషాలు. దీనికితోడు కక్షసాధింపు చర్యలు కూడా అప్పుడప్పుడు గోచరమవుతాయి. అన్నిటికీ మించి దుందుడుకు స్వభావం ఉండటం వీరి వల్ల కుటుంబం కొన్ని సమస్యలు ఎదుర్కొనాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి.

వృశ్చిక రాశికి చెందినవారు దృఢమైన నిశ్చితాభిప్రాయాలు కలిగి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. సహజజ్ఞానంతో వివేకవంతులైన వీరు మంచి చతురతతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు.

CLICKHERE : ముఖంపై వచ్చే అవాంచిత జుట్టును తొలగించటం ఎలా?


ధనస్సు 
మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం

ధనస్సు రాశికి చెందిన వారు ఛామనఛాయగా ఉంటారు. ప్రతిఒక్కరూ వీరంటే ఇష్టపడతారు. రంగుకు తగ్గట్టుగానే వీరి స్వరూపం బాగుంటుంది. ఈ రాశి వారు అందరినీ కలుపుకు పోతారు.

దుందుడుగు స్వభావం కలవారుగా ఉంటారు. అయితే వీరు కుటుంబ సభ్యులతో సర్ధుకుపోగలరు. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోగలరు.

మంచి అలవాట్లను కలిగి ఉంటారు. ధనస్సు రాశికి చెందిన వారు పక్కవారికి ఆదర్శవంతంగా ఉంటారు. అందరికీ సహాయం చెయ్యాలన్న తపన వీరికున్న ప్రత్యేక లక్షణం. మంచి చెడులను గూర్చి వీరు నేర్చుకుంటూనే ఉంటారు. ఈ రాశివారు కళలు, సినిమాలపై దృష్టిపెడతారు. క్రీడలన్నా ఆసక్తే.

ధనస్సు రాశివారు ఉద్రేక స్వభావులుగా ఉండి ఎదుటి వ్యక్తి చెపుతున్న మాటలను పట్టించుకోకపోవటమనే పెద్ద బలహీనతతో ఉంటారు. ఈ గుణాన్ని కనుక జయిస్తే వారికి తిరుగుండదు.

ఉన్నత వ్యక్తిత్వం గలవారై ఉంటారు. జీవితంలో ఎప్పుడూ నిజాయితీతో ముందుకు సాగాలన్న ధ్యేయంగా ఉంటారు. వీరి వ్యక్తిత్వాన్ని చూసి ఇతరులు వేయనోళ్ల పొగుడుతారు. స్పష్టమైన వైఖరి కలిగిన ఈ రాశి వారు ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే ముందు తరచి తరచి ఆలోచిస్తారు.

CLICKHERE : అనసూయ చెప్పిన నిజాలు వింటే షాక్

మకరం 
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు

ఈ రాశివారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా నగలు, ఉంగరాలు వంటివాటిపై ఆసక్తి ఎక్కువ. వస్త్ర ధారణలోను తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. వీరి వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు. వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది.

మకర రాశికి చెందిన వారు ఆశావాదులుగానూ, ఆచరణశీలిగానూ, దృఢనిశ్చయంకలవారై ఎంచుకున్న ప్రతి మార్గంలోనూ విజయం సాధించేవారుగా ఉంటారు. దీనికి ఓర్పు, అప్రమత్తత, కష్టపడి పనిచేయటం వంటి గుణాలు తోడవటంతో విజయం సుగమమవుతుంది. భవిష్యత్ ప్రణాళికల విషయంలో దూరదృష్టితో వ్యవహరిస్తారు. సంబంధాలను
ఏర్పరచుకోవటంలోనూ  ఇదే మార్గాన్ని అనుసరిస్తారు.వీరి దృఢ స్వభావం విలాసాలను కోరుకునే భాగస్వామికి ఒకింత ఇబ్బంది కలిగించకు మానదు. కష్టించి పనిచేయటం, క్రమశిక్షణ అనే రెండు పదాలు మకర రాశికి చెందిన వారికి అతికినట్టు సరపోతాయి. 

ఈ రాశికి చెందిన వారు చారిత్రక విషయాల పట్ల అత్యంత శ్రద్ధను కనబరుస్తారు.చరిత్రాత్మక వస్తువులను సేకరిస్తారు.

మకరరాశివారిలో ప్రధాన బలహీనత నిరాశావాదం. వారి ఆలోచనలో నిరాశ తొంగిచూస్తుంటుంది. అదే సమయంలో ఏదైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోరు.

చంద్రగ్రహ ప్రభావం వీరిపై ఉండటం వల్ల వీరి మనస్సు క్షణక్షణానికి మారుతుంటుంది. ఈ చంచెల స్వభావం వల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వీరు స్థిరచిత్తులుగా మారక తప్పదు. ఇక అప్పట్నుంచి వీరు అనుసరించే మార్గం లాభాలను తెచ్చిపెడుతుంది.

CLICKHERE : కిడ్నీలో రాళ్ళూ ఏర్పడకుండా ఉండాలంటే....

కుంభం 
ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

కుంభరాశికి చెందిన వారు అందంగా కోమలమైన మనసును కలిగి ఉంటారు. సున్నిత స్వభావులుగా ఉండటం వల్ల చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వరం నిర్ణయాలు తీసుకోలేని వారుగా ఊగిసలాడతారు. ఫలితంగా కొన్నిసార్లు సమస్యలలో చిక్కుకునే అవకాశం ఉంది.

సన్నగా పీలగా ఉంటారు. అయినా ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు. మంచి ఎత్తుతో తెల్లని రంగుతో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం. అందరికీ సాయం చేసే లక్షణాలు కలిగిన ఈ రాశివారు మిగిలిన రాశులు వారితో అత్యంత స్నేహ పాత్రంగా మెలగుతారు. ఇతరులకు సాయపడే గుణం వలన వీరంటే అందరూ ఇష్టపడతారు.మొత్తం మీద చూసినప్పుడు ఈ రాశి వారు ఇతురులను అవహేళనచేసి మాట్లాడటం అంటే వీరికి నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారంటే ఎక్కువగా ఇష్టపడతారు.తాము చేసే పనులను చేతల్లో కాక మాటల్లో చూపిస్తారు. వీరు ముక్కుసూటి తనం శత్రువులను కూడా తెచ్చి పెడుతుంది. అయినప్పటికీ తమకంటూ ఉన్న నియమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. అలాగే వీరిలో కాస్తంత నిర్లక్ష్య వైఖరితోపాటు మొండి పట్టుదలకూడా ఉంటుంది. ఫలితంగా అనవసర సమస్యలలో చిక్కుకుంటారు.

కుంభరాశికి చెందినవారు ఫోటోగ్రఫీ, కథలను చదవటం తదితర అంశాలపై ఆసక్తిని కలిగి ఉంటారు. సాహిత్య ప్రియులైన వీరు దీనికి సంబంధించిన ఇతర అంశాలపైన శ్రద్ధను చూపుతారు.

కుంభరాశికి చెందినవారు తమదైన శైలిలో జీవనం సాగించటమేకాకుండా తాము చెప్పిందే వేదమన్నట్లు ప్రవర్తించటమనే లక్షణమే వీరికి పెద్ద బలహీనతగా ఉంటుంది. ఈ గుణం వల్ల ఇతురులు ఏది చెప్పినా పట్టించుకోని స్థితిలో ఉంటారు. ఎక్కడికి వెళ్లినా తన పంథాను మార్చుకోరు. సంవాదాల్లో కానీ, వ్యక్తిత్వంలోగానీ తనకంటూ కొన్ని కట్టుబాట్లు నిర్దేశించుకుంటారు. వారు చేసిన సహాయనికి సంబంధించి వారికి లభించే కృతజ్ఞతలను ప్రతిసారి అపార్థం చేసుకుంటుంటారు. వారి చుట్టూ ఆధిపత్య ధోరణిని ఉండటాన్ని సహించరు. తమపై అధికారుల వద్ద తల దించుకునే పరిస్థితి తలెత్తితే రాజీనామా చేయటానికి సిద్ధపడతారు కొన్ని సమయాల్లో కుంభరాశి వారిని అతిగా ప్రవర్తించేవారని అనడం కూడ జరుగుతుంది. మానవతా వాదంలో వీరు అంత త్వరగా అందరికి అర్ధం కారు.

కుంభరాశికి చెందిన వారు సూటైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తాము అనుకున్న పనిని సాధించే వరకూ విశ్రమించనివారుగా ఉండే కుంభరాశివారు ఇతరులు కష్టాలలో ఉంటే త్వరగా స్పందించే వారుగా ఉంటారు.

CLICKHERE : పుల్లారెడ్డి స్వీట్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు 

మీనం 
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

వీరు నలుపుగా ఉండటంవల్ల చాలామంది వీరికి దూరంగా ఉంటారు. అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్దం. ప్రతిఒక్కరినీ కలుపుపోయే అలోచన వీరికి ఎప్పుడూ ఉంటుంది.

నమ్రతతో కూడిన వ్యక్తిత్వంగల గుణాన్ని చూసి వారు మీన రాశికి చెందినవారని మీరు ఇట్టే గుర్తిస్తారు. ఆధ్యాత్మిక మార్గంపై ఇష్టతను కలిగి ఉండటమేకాక ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు. ఈ మార్గం వారిని కపటం లేని వ్యక్తులుగా తయారు చేస్తుంది. ఉన్నత శిఖరాలకు తీసుకవెళుతుంది.

నమ్రతతో కూడిన వ్యక్తిత్వంగల గుణాన్ని చూసి వారు మీన రాశికి చెందినవారని మీరు ఇట్టే గుర్తిస్తారు. ఆధ్యాత్మిక మార్గంపై ఇష్టతను కలిగి ఉండటమేకాక ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు. ఈ మార్గం వారిని కపటం లేని వ్యక్తులుగా తయారు చేస్తుంది. ఉన్నత శిఖరాలకు తీసుకవెళుతుంది.

అస్పష్ట, నిస్సహాయ, గందరగోళం, అవిశ్వసనీయ, తప్పించుకొనేటువంటి బలహీన గుణాలు కలిగిన వీరు కొన్ని సందర్భాలలో చాలా తేలికగా ఉన్నవాటిని కొన్ని కోల్పోతారు. కాస్త అవకాశం ఇస్తే మీపై ఆధిపత్యం చెలాయించటానికి చూస్తాడు. అయితే ఆత్మవిశ్వాసం అంతగా లేకపోవటంతో అతను తిరిగి దారిలోకి రావాల్సి వస్తుంది.

ఈ రాశికి చెందినవారిలో ఉన్న చాలా మంచి గుణాలు... గందరగోళం, మూఢ విశ్వాసం, ఆదర్శవాదాల ముసుగులో కప్పబడి ఉంటాయి. అందువల్ల వీరి వ్యక్తిత్వం ఎదుటివారికి అంత స్పష్టంగా గోచరించదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top