దాసరి హాస్పిటల్‌ బిల్లు ఎంతో తెలిస్తే గుండె పట్టుకుంటారు..!


దర్శకరత్న దాసరి నారాయణ రావు తీవ్ర అస్వస్థతతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని కిమ్స్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. ఈయన ఆరోగ్యంపై టాలీవుడ్‌ వర్గాల వారు కొన్ని రోజుల క్రితం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దాసరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, అయితే ఆయన పూర్తిగా కోలుకునేందుకు సమయం పడుతుంది అంటూ కిమ్స్‌ వైధ్యులు చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతానికి కూడా హాస్పిటల్‌లోనే దాసరి ఉన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో దాసరికి అత్యంత ఖరీదైన వైధ్యంను కిమ్స్‌ అందిస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

CLICKHERE : మన హీరోయిన్స్ సొంతూరు ఎక్కడో తెలుసా..?



కిమ్స్‌ నుండి మరి కొన్ని రోజుల్లో దాసరి నారాయణ రావు డిశ్చార్జ్‌ అయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన బిల్లు గురించి సినీ వర్గాల్లో మరియు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. కిమ్స్‌లో వీఐపీ వార్డులో అత్యంత ఆధునిక హంగులు ఉన్న ఒక ప్రత్యేకమైన రూంలో దాసరిని ఉంచడం జరిగింది.
CLICKHERE : శని గ్రహాన్ని అనుకూలంగా చేసుకోవడం ఎలా?


ఏసీతో పాటు సకల సౌకర్యాలు ఉన్న ఆ గది రోజువారి రెంట్‌ 40 వేలు. మరియు ఇతరత్ర వైధ్య ఖర్చులు అదనం. ఒక డాక్టర్‌ మరియు ముగ్గురు సిస్టర్స్‌ ప్రత్యేకంగా దాసరి కోసం నియమించడం జరిగిందట. దాంతో మొత్తం ఇప్పటి వరకు 90 లక్షలకు హాస్పిటల్‌ బిల్లు చేరిందని అంటున్నారు. దాంతో సాదారణ వార్డుకు దాసరి షిప్ట్‌ అవ్వాలని భావిస్తున్నారట.

CLICKHERE : ఫేస్‌బుక్‌ యూజర్లకు శుభవార్త!

డిశ్చార్జ్‌ అయ్యే వరకు కోటి వరకు బిల్లు అయినా ఆశ్చర్య పోనవసరం లేదు అంటున్నారు. అయితే దాసరి మాజీ కేంద్ర మంత్రి కనుక ఆయన హాస్పిటల్‌ బిల్లులు కేంద్ర ప్రభుత్వం భరించే అవకాశాలున్నాయి. అయితే దాసరి కేంద్ర ప్రభుత్వంను హాస్పిటల్‌ బిల్లుల కోసం అర్దిస్తాడా అనేది చూడాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top