ఉగాదిని 29నే చేసుకోవాలి…లేకపోతే ఇబ్బందులే!


తెలుగు సంవత్సరాది ఉగాదిని తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై ప్రజల్లో సందిగ్దత నెలకొంది. ప్రచారకర్తలు ఈ నెల 28న నిర్వహించుకోవాలంటే, మరికొందరు 29 అని పేర్కొంటున్నారు. ఉగాది పండుగను మార్చి 29వ తేదీ బుధవారమే జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. అయితే శ్రీ హేవిళంబినామ సంవత్సర ఉగాది పండుగను మార్చి 29 బుధవారం ఆచరించి సంవత్సరమంతా శుభ ఫలితాలను పొందండి.

CLICKHERE : 7 శనివారాలు ఇలా చేస్తే తీరని కోరికలు తీరడమే కాకుండా.... అష్టఐశ్వర్యాలు సిద్దిస్తాయి



28 మార్చి మంగళవారం అమావాస్య ఉదయ 8:30 వరకు ఉన్నందున అమావాస్యతో కూడిన చైత్రశుద్ధ పాఢ్యమి సందిఘడియలతో కూడుకున్న మంగళవారం ఉగాది పండగను ఆచరించడం వలన ఆ సంవత్సరం అంతా చెడుఫలితాలను అనుభవించాల్సి వస్తుందని అంటున్నారు. 1998లో బహుధాన్య సంవత్సరంలోనూ మార్చి 28, 29 తేదీల్లోనూ ఈ సమస్య వచ్చింది. అప్పట్లో ఎక్కువ మంది 29నే ఉగాది జరుపుకున్నారు. ఆ తరువాత 2007 సర్వజిత్‌ నామ సంవత్సరంలో మరోసారి మార్చి 19, 20 తేదీల్లో ఏ తేదీ అనేది చర్చకు వచ్చింది. ఆ సమయంలో ప్రభుత్వం 19న ఉగాది నిర్వహిస్తే ప్రజలు మాత్రం మార్చి 20న ఉగాది జరుపుకున్నారు. ఇప్పుడు మూడోసారి ఈ సంశయం వచ్చి పడింది.

CLICKHERE : అన్నం తింటే లావు అవుతారు....కానీ అన్నం తో చేసిన జావా త్రాగితే స్లిమ్ అయిపోతారు...ఎలా???
మార్చి 29 ఉదయం 8 గంటల వరకు పాడ్యమి తిది మిగిలి ఉన్నందున ఆ రోజునే ఉగాది జరుపుకోవాలని పూర్వ సిద్ధాంతాన్ని అనుసరించి పంచాంగాన్ని రూపొందించే సిద్ధాంతులు స్పష్టం చేస్తున్నారు. పండగ తేదీలు వివాదం కావడం పరిపాటయిపోయింది. ప్రతీ ఏటా ఏదో ఒక పండుగ తేదీపై పంచాంగాలు, క్యాలండర్లు చెరో మాట చెబుతున్నాయి. పండితులు కూడా రెండు శిబిరాలుగా విడిపోయి భిన్నమైన వాదనలు వినిపిస్తుంటారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top