అన్నం తింటే లావు అవుతారు....కానీ అన్నం తో చేసిన జావా త్రాగితే స్లిమ్ అయిపోతారు...ఎలా???


అన్నం తింటే బరువు పెరుగుతారని అందరూ చెబుతుంటేనూ మీరేంటి రైస్ డ్రింక్ తాగితే బరువు తగ్గుతారని రివర్స్ లో అంటున్నారని అనేనా సందేహం.. ఖచ్చితంగా బరువు తగ్గేందుకు రైస్ డ్రింక్ తాగాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు అధనపు కొవ్వు బరువు పెరిగేందుకు కారణం అవుతుండగా.. దానిని తగ్గించుకునేందుకు అనేక మార్గాల్లో ట్రై చేస్తున్నారు చాలా మంది. 


CLICKHERE : శని గ్రహాన్ని అనుకూలంగా చేసుకోవడం ఎలా?
ఇలా డైటింగ్ చేసే క్రమంలో బరువు తగ్గేవరకైనా అన్నం తినడం తగ్గించాలని సూచిస్తుంటారు. కాని అన్నం లేకుండా ఉండలేమని ఆందోళన చెందుతుండడాన్ని చూస్తూనే ఉంటాం.. అలాంటి వారికి కింద చెప్పిన రైస్ డ్రింక్ ఓ వరం లాంటిదేనని చెప్పాలి. ఎందుకంటే ఈ డ్రింక్ తాగితే అన్నం తిన్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా కొవ్వు కరుగుతుంది. ఇది పూర్తిగా ఇంట్లోనే తయారు చేసుకోగల డ్రింక్. రైస్ డ్రింక్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం.


CLICKHERE : మన హీరోయిన్స్ సొంతూరు ఎక్కడో తెలుసా..?
రైస్ డ్రింక్ తయారీకి కావల్సిన పదార్థాలు
*బియ్యం రెండు టేబుల్ స్పూన్లు
* నీరు తగినంత
* జిలకర తగినంత
* ఎండిన అల్లం పొడి తగినంత
* మిరియాల పొడి- తగినంత


తయారు చేసే విధానం
జీరా, అల్లం పొడి, మిరియాల పొడిలను సమాన భాగాల్లో తీసుకుని వాటిని మళ్లీ మిక్సీ పట్టి పొడిగా చేయాలి. ఈ పొడి నుంచి 1/4 టీస్పూన్ పొడిని తీసుకుని దాన్ని బియ్యానికి కలిపి ఈ మిశ్రమాన్ని మళ్లీ ఒక గ్లాస్ నీటికి కలపాలి. ఒక పాత్రలో ఈ మిక్స్ ను వేసి డికాషన్ లా మరిగించాలి. అనంతరం వచ్చే ద్రవాన్ని వడకట్టి దానికి కొద్దిగా ఉప్పును కలిపి తీసుకోవాలి. 


CLICKHERE : కాటమరాయుడు హిట్టా.. ఫ‌ట్టా - ఫైనల్ రిజ‌ల్ట్ ఇదే
బరువు తగ్గేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించేవారు దీన్ని తాగితే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరుగుతుంది. అంతేకాదు కొంత కొద్ది డ్రింక్ తోనే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఇది అధిక బరువు తగ్గించుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top