నాగబాబు-రోజాకి మరీ ఇంత చీప్ ట్రిక్స్ అవసరమా..?


తెలుగులో కామెడీ షోలకు కింగ్ గా చెప్పుకునే జబర్దస్త్ లో మొత్తం బూతు పురాణం ఉన్నా కూడా అందరూ దాని వెంటే పడుతుంటారు. కారణంగా జబర్దస్త్ రేటింగ్ లో కూడా టాప్ లో ఉంటుంది. కమెడియన్స్ బూతు పంచ్ లకు హాట్ యాంకర్స్ అనసూయ, రశ్మీల అందాలు జోడించడంతో, ఈ షోకి మరింత కళవచ్చింది. ఇంతటి క్రేజ్ ఉన్న ప్రోగ్రాంలో ఇప్పుడు కొన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు జడ్జ్ లు నాగబాబు, రోజా. తాజాగా ప్లే అవుతున్న ప్రోమో చూస్తే మీకే అర్ధమవుతుంది. డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వస్తే..సుడిగాలి సుదీర్ టీం ఒక స్కిట్ చేస్తుంది. అది చూసిన నాగబాబు-రోజా అసలు మీకు వేరే టాపిక్ దొరకదా? ఎప్పుడూ లవ్ లెటర్ ను కూతురుకో, లేక అమ్మకి ఇవ్వడం తప్ప ఇంకేమీ దొరకవా అని అడుగుతారు.
దీంతో మీరు వచ్చి చెయ్యండి సార్ తెలుస్తుంది అంటారు సుదీర్ టీం.దీంతో ఒళ్ళు మండిన నాగబాబు..మీకు పొగరు, అహంకారం అన్నీ నెత్తికి ఎక్కాయిరా, జబర్దస్త్ నుంచి వెళ్ళిపోండి గెట్ ఔట్ అంటాడు. దీంతో టీం అంతా వెళ్ళిపోతుంది. అసలు అది జోకా? సీరియస్? అనే విషయం పక్కన పెట్టిన కొందరు ప్రేక్షకులు మాత్రం నాగబాబు-రోజాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక ప్రోగ్రాంకి జడ్జ్ లుగా ఉంటూ మరీ ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చయ్యడం అవసరమా? అని మండిపడుతున్నారు. ఈ రోజుల్లో జనాలు అంత ఎర్రిపప్పలు ఎవరూ లేరని, ఈటీవీ లాంటి పెద్ద ఛానెల్ లో రేటింగ్ కోసం ఇలా చెయ్యడం ఏమీ బాగోలేదని కూడా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఆ తరువాత అసలు విషయం బయటపడింది. మార్చ్ పూర్తి అయ్యి ఏప్రిల్ వస్తుంది కాదా? జబర్దస్త్ ప్రేక్షకులను ఏప్రిల్ పూల్ చెయ్యడానికే ఇలా ప్లాన్ చేసినట్టు తెలిసింది. మరి ఎంతమంది ఫూల్ అయ్యారో తెలియాల్సిఉంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top