కసూరి పనీర్‌ టిక్కా


కావల్సినవి: 
 పనీర్‌ ముక్కలు- రెండొందల గ్రాములు, కసూరిమెథీ - పావుచెంచా, అల్లం వెల్లుల్లి ముద్ద - అరచెంచా, ఉప్పు, కారం - రుచికి తగినంత, మిరియాలపొడి - పావుచెంచా, పెరుగు - నాలుగు చెంచాలు, గరంమసాలా - పావుచెంచా, పసుపు - చిటికెడు, నూనె - రెండు చెంచాలు.
తయారీ:
పనీర్‌ను ముక్కలుగా కోసి మిగిలిన పదార్థాలన్నీ చేర్చి.. అన్నింటినీ బాగా కలపాలి. ఇరవై నిమిషాల తరవాత పొయ్యి మీద పెనం పెట్టి వేడయ్యాక ఈ ముక్కలను వేసి... నూనెతో రెండువైపులా కాల్చాలి. గోధుమరంగులోకి మారాక తీసేస్తే.. వేడివేడి కసూరీ పనీర్‌ టిక్కా సిద్ధమయినట్టే. టమాటాసాస్‌తో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top