మారిన జీవనశైలితో జీర్ణకోశ సమస్యలు.....నివారణ ఇలా.....

ఇటీవల ఆహారపు అలవాట్లు ఇటీవల విపరీతంగా మారాయి. ఫాస్ట్‌ఫుడ్ తీసుకోవడం, నియమిత వేళల్లో కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినడం బాగా పెరిగాయి. జీవనశైలిలో మార్పులు జీర్ణక్రమాన్ని ప్రభావితం చేస్తాయి. దాంతో కాలేయం, క్లోమం, గాల్‌బ్లాడర్‌ల పని తీరు మారి అజీర్తి, గ్యాస్, త్రేన్పులు, కడుపునొప్పి, మంట, మలబద్దకం, విరేచనాలు వంటివి తరచూ కనిపిస్తున్నాయి.

ఈ లక్షణాలు కనిపించినప్పుడు వాటికి కారణాన్ని తెలుసుకోవడానికి రక్తపరీక్ష, మల పరీక్షతోపాటు అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎండోస్కోపీ వంటి పరీక్షలు అవసరమవుతాయి.


మీకు ఈ కిందివాటిలో ఏవైనా లక్షణాలు కనిపిస్తుంటే ఒకసారి డాక్టర్‌ను కలవడం అవసరం. తీవ్రమైన కడుపునొప్పి బరువు తగ్గడం ఛాతీలో మంట మలబద్దకం మలంలో రక్తం పడడం.


జీర్ణసంబంధ వ్యాధులలో ముఖ్యమైనవి మలబద్దకం. పైల్స్, వాంతులు, వికారం, ట్రావెలర్స్ డయేరియా, చిన్నపిల్లల్లో అజీర్తి, జీర్ణాశయం- పేగు ఇన్‌ఫెక్షన్, పేగులో అల్సర్.



కారణాలు ఇవి:
దవపదార్థాలను, పీచు ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడం

కొన్ని రకాల మందుల వాడకం

విరేచనానికి నియమిత సమయాన్ని కేటాయించకపోవడం, తరచుగా ఫ్రీ మోషన్ కోసం మందులు వాడడం



నివారణ ఇలా:
రోజుకు కనీసం మూడు లీటర్ల నీటిని, ఇతర ద్రవపదార్థాలను తీసుకోవడం

మొలకలు, గ్రీన్ సలాడ్, క్యారట్, కీర, టొమాటో, క్యాప్సికం, ముల్లంగి వంటి పచ్చి కూరగాయలను, పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని, ఆకుకూరలు, పండ్లను తీసుకోవడం

గోధుమలు, ముడిబియ్యం ఎక్కువగా తీసుకోవడం

యోగ, నడక, వ్యాయామం, ధ్యానం, సరైన నిద్రను పాటించడం

ఇతర వ్యాధులకు మందులు వాడుతుంటే ఆ విషయాన్ని డాక్టరుకు తెలియచేయడం జీర్ణకోశ సంబంధ సమస్యలకు చికిత్స వారి శారీరక తత్వాన్ని బట్టి, జీవన విధానం, ఆహారపు అలవాట్లను బట్టి ఉంటుంది.

నక్స్‌వామిక, ఆస్క్‌లస్‌హివ్, లెటానియ, కోలిన్‌సోనియ, గ్యాస్ సమస్యకు కార్బొవెజ్, చైన, లైకోపోడియం వంటి మందులు బాగా పని చేస్తాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top