మందులకు కొరుకుడు పడని రోగాలు కొన్ని సందర్భాలలో మన ప్రాచీనులు కనిపెట్టిన యోగాభ్యాసాలకు లొంగుతున్నాయి.

మందులకు కొరుకుడు పడని రోగాలు కొన్ని సందర్భాలలో మన ప్రాచీనులు కనిపెట్టిన యోగాభ్యాసాలకు లొంగుతున్నట్లు మన దేశంలోనే కాదు పాశ్చాత్య దేశాలలో జరిగిన పరిశోధనల్లో కూడా వెల్లడైంది. మిగిలిన వైద్య విధానాలు కేవలం శరీరంపైనే ప్రభావం చూపుతాయి. కాని, యోగాస నాల వల్ల శారీరకంగానే కాక మానసికంగా ప్రశాంతత చేకూరడంతోపాటు ఆధ్మాత్మిక చైతన్యం ఏర్పడుతుందని. క్రమం తప్పకుండాయోగా చేయడం వల్ల మానసిక ఉల్లాసంతోపాటు శారీరకంగా చక్కని ఫిట్‌నెస్ లభిస్తుంది. యోగా వల్ల లభించే ముఖ్యమైన ప్రయోజనాలు ఇవి.

శరీరంలో అలసట దూరమవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోజూ యోగా చేయడం వల్ల వొళ్లు నొప్పులు తగ్గుతాయి. కొన్ని తీవ్రమైన జబ్బుల వల్ల వచ్చే నొప్పులు కూడా యోగాతో దూరమైనట్లు తేలింది. యోగాభ్యాసాలలో భాగమైన ప్రాణాయామాల వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. ఉబ్బసం వంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

యోగాతో శరీరం రబ్బరులా సాగుతుంది. వొళ్లు తేలికగా సాగి కీళ్లకు చక్కని శక్తి లభిస్తుంది. కీళ్ల వ్యాధులకు యోగా చక్కని పరిష్కారం చూపించగలదు. అలాగే కండరాలు కూడా చక్కని బలాన్ని పుంజుకుంటాయి.


యోగాభ్యాసాలు శరీరంలోని వ్యర్థ పదార్థాల విసర్జనకు తోడ్పడతాయి. వొంట్లోని వ్యర్థ కొవ్వు కరిగిపోవడం వల్ల బరువు తగ్గి చలాకీగా ఉంటారు. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా యోగా చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ లెవల్ తగ్గి పల్స్ రేటు సాధారణ స్థాయిలో ఉంటుంది. యోగాతో లభించే మరో చక్కని ప్రయోజనం గుండెకు సంబంధించిన వ్యాధులను దూరం చేయడం. రోజూ ప్రాణాయామం చేయడం వల్ల హార్ట్ బీట్ కంట్రోల్‌లో ఉంటుంది.

నిత్యం యోగా చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మెమరీ పవర్ పెరుగుతుంది. అలాగే ఏకాగ్రత కూడా బాగా పుంజుకుంటుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే యోగాభ్యాసాల పట్ల అన్ని వయసుల వారు ఆసక్తి చూపుతున్నారు. ఇంట్లో ఉండి ఒక గంటో అరగంటో సమయం వెచ్చిస్తే కాణీ ఖర్చులేకుండా ఆరోగ్యం లభిస్తున్నపుడు యోగా చేయడానికి అభ్యంతరాలేమిటి? 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top