షుగర్ ఉన్నవారు అరటిపండు తినకూడదా..?

ఇటీవలి పరిశోధనల ఫలితాల ప్రకారం షుగర్ ఉన్నవారైనా సరే... ఫలానా పండు లేదా ఆహార పదార్థం తీసుకోకూడదని ఎలాంటి నియమం లేదు. ఏదైనా తినవచ్చు. దానివల్ల ఒనగూరాల్సిన సత్ఫలితాలు శరీరానికి అందుతాయి. అరుుతే... ఇలా తినే సమయంలో ఒక్క విషయుం గుర్తుపెట్టుకోవాలి. మనం తీసుకునే క్యాలరీలకు సరిపడినంతగా శారీరక శ్రమ చేయూలి. దాంతో పాటు సింపుల్ షుగర్స్ (అంటే... తియ్యదనం కోసం మనం వాడే పదార్థాలైన చక్కెర, తేనె, బెల్లం వంటివి) పదార్థాల విషయంలో మాత్రం బాగా నియంత్రణ పాటించాలి. వేపుళ్లు, కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్థాలు తినే విషయంలో సంయమనం పాటించాలి. షుగర్ స్థాయులు అదుపులో ఉంచుకునేలా శారీరక శ్రమ చేస్తున్నంత కాలం ఎవరైనా ఏ పండైనా, ఏ ఆహార పదార్థాన్ని అయినా తీసుకోవచ్చు. అయితే దానితో మన శరీరంలోకి చేరిన అదనపు క్యాలరీలను వ్యాయామంతో ఖర్చు చేయాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top