ఒక డ్రెస్‌కు పర్‌ఫెక్ట్ యాక్సెసరీస్ ఎలా ఉండాలి? యాక్సెసరీస్‌లోకి ఏమేం వస్తాయి?

చెప్పులు, కళ్లద్దాలు, ఆభరణాలు, హ్యాండ్ బ్యాగ్, బెల్ట్, గొడుగు, క్యాప్... దుస్తులు కాకుండా మనం ఏమేం ఉపయోగిస్తామో అవన్నీ యాక్సెసరీస్‌లోకి వస్తాయి. ఒక డ్రెస్ ధరించినప్పుడు దానికి తగ్గ మ్యాచింగ్ లేదా ఆ డ్రెస్సులో ఉన్న కలర్ కాంబినేషన్స్ ఉన్న చెప్పులు, బ్యాగ్, జ్యూయలరీ... లాంటివి సెలక్ట్ చేసుకొని ధరిస్తే పర్‌ఫెక్ట్ డ్రెసింగ్ అంటారు. కళ్లద్దాలయితే కాలానుగుణంగా షేడ్స్ సెలక్ట్ చేసుకోవాలి. వేసవిలో డార్క్, వర్షాకాలంలో ప్లెయిన్, చలికాలంలో లైట్ షేడ్ గాగుల్స్ బాగుంటాయి. ఇక హ్యాట్ లేదా క్యాప్ మనం వేసుకునే డ్రెస్‌ను బట్టి షేడ్స్ సెలక్ట్ చేసుకోవాలి. గౌన్లు ధరించినప్పుడు మంచి లేసులతో డిజైన్ చేసిన హ్యాట్స్ బాగుంటాయి. జీన్స్, టీషర్ట్స్ వేసుకున్నప్పుడు క్యాప్స్ అందంగా ఉంటాయి. ఇక స్కార్ఫ్ విషయానికి వస్తే ప్లెయిన్ టీ షర్ట్స్ ధరించినప్పుడు ప్రింటెడ్ స్కార్ఫ్, ప్రింటెడ్ టీ షర్ట్ ధరించినప్పుడు ప్లెయిన్ స్కార్ఫ్ వేసుకుంటే కలర్‌ఫుల్‌గా కనిపిస్తారు. వింటర్‌లో ఊలు స్కార్ఫ్‌లు ధరిస్తే స్టైల్‌గానూ, సౌకర్యంగానూ ఉంటుంది. 

ఫుట్‌వేర్ విషయానికి వస్తే జీన్స్ వేసుకున్నప్పుడు బోట్, థంబ్ షూస్, హీల్స్, ఫ్లాట్స్, స్లిప్పర్స్, వింటర్‌లో లాంగ్ బూట్లు కూడా బాగుంటాయి. గౌన్లు వేసుకున్నప్పుడు స్కిల్ టోస్ కాని, పంప్ షూస్ కానీ వాడాలి. చీర, సల్వార్ కమీజ్ ధరించినప్పుడు ఎంబ్రాయిడరీ చేసిన మ్యాచింగ్ చెప్పులు, హై హీల్స్ వేసుకోవాలి. అబ్బాయిలు కుర్తా పైజామాలు ధరించినప్పుడు జూటీలు వేసుకోవాలి. వేసవి, వర్షాకాలంలో గొడుగులు వాడేటప్పుడు డ్రెస్‌కు తగ్గట్టుగా ఎంపిక చేసుకోవాలి. అంటే ప్రింటెడ్ డ్రెస్ వేసుకున్నప్పుడు ప్లెయిన్, ప్లెయిన్ డ్రెస్ వేసుకున్నప్పుడు ప్రింటెడ్ గొడుగు వాడితే బాగుంటుంది. హ్యాండ్‌బ్యాగ్స్ విషయంలోకి వస్తే... శారీస్ కట్టుకొని పార్టీకి వెళ్లేప్పుడు ఎంబ్రాయిడరీ చేసిన క్లచెస్ పట్టుకోవాలి. బెల్టులు అయితే, మార్కెట్లో రకరకాల సైజుల్లో 2 అంగుళాల నుంచి 8 అంగుళాల సైజుల్లో లభిస్తున్నాయి. లెదర్, షిమ్మర్ లెదర్, కాటన్, డెనిమ్, ఎంబ్రాయిడరీ.. ఇన్ని రకాల బెల్టులను ఎంపికచేసుకోవచ్చు. ప్లెయిన్ టాప్‌వేసుకొని మూడు అంగుళాల బెల్టు పెట్టుకుంటే డ్రెస్‌కి మంచి షేప్ వస్తుంది. ఒక మంచి గౌన్ వేసుకొని దానికి కూడా హెవీ బెల్ట్ పెట్టుకుంటే లుక్ చాలా ఫ్యాషనబుల్‌గా కనిపిస్తుంది. డ్రెస్ ఎంపిక ఎంత ముఖ్యమో దానికి తగిన యాక్సెసరీస్ పర్‌ఫెక్ట్‌గా ఉంటేనే ఆ డ్రెసింగ్ అంత బాగుంటుంది. మీరు ఫ్యాషనబుల్ పర్సన్ అనేది అందరికీ తెలుస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top