పిల్లల్ని క్రమశిక్షణతో పెంచుతున్నారా? చెప్పిన మాట వినకపోతే వాళ్లను కఠినంగా దండిస్తున్నారా? అయితే ఒక్క క్షణం మీరు ఆలోచించాల్సిందే!

పిల్లల్ని క్రమశిక్షణతో పెంచుతున్నారా? చెప్పిన మాట వినకపోతే వాళ్లను కఠినంగా దండిస్తున్నారా? అయితే ఒక్క క్షణం మీరు ఆలోచించాల్సిందే! పిల్లల్ని మితిమీరిన క్రమశిక్షణతో పెంచితే వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారని, వారిలో మనోవేదన ఏర్పడి. అది ఆత్మన్యూనతకు దారితీసే ప్రమాదం ఉందని ఒక తాజా అధ్యయనంలో తేలింది. పిల్లల్ని భయపెట్టి, దండించి క్రమశిక్షణగా పెంచడం వల్ల లాభాల కన్నా నష్టాలే అధికమని అమెరికాకు చెందిన మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.

తల్లిదండ్రుల అభీష్టం మేరకు వారి కనుసన్నల్లో పెరిగిన పిల్లల్లో పెద్దల ఆశలను నెరవేర్చగలమో లేమో అన్న ఆందోళన అధికమై అది డిప్రెషన్‌కు కూడా దారితీస్తోందని ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన డాక్టర్ డిసైరీ క్విన్ పేర్కొన్నారు. విజయం, సంతోషం ఒకేచోట ఉండడం కష్టమని న్యూయార్క్‌లోని ఎలైట్ హైస్కూల్ విద్యార్థుల మనస్తత్వాలను బట్టి అర్థమవుతోందని ఆమె అంటున్నారు. చదువు విషయంలో తల్లిదండ్రులు పెడుతున్న ఒత్తిడికి పిల్లలు ఇతర పిల్లలకు దీటుగా ఎదగలేమోనన్న భయంతో ఆత్మన్యూనతా భావాన్ని కూడా పెంచుకుంటున్నారు. 



అదే ఎటువంటి ఒత్తిడి లేకుండా చదువుకుంటున్న పిల్లలు ఎటువంటి మానసిక సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటున్నారు. చదువుల్లో వెనకబడితే కుటుంబంలో తమ పరువు మర్యాద పోతాయని పదే పదే పిల్లల్ని హెచ్చరించడం వల్ల వారు చదువు మీద శ్రద్ధ పెట్టే మాట అటుంచి పదేపదే ఆందోళన చెందుతున్నట్లు తమ అధ్యయనంలో తేలినట్లు ఆమె చెబుతున్నారు.

అయితే, చైనాకు చెందిన ప్రముఖ రచయిత్రి అమీ చువా తన పుస్తకంలో ఇందుకు పూర్తి భిన్నమైన వాదన వినిపించారు. తల్లిదండ్రులు పెడుతున్న తీవ్ర ఒత్తిడి కారణంగానే ఆసియా ఖండంలో పిల్లలు విద్యాపరంగా, మానసిక వికాసపరంగా విజయాలు సాధిస్తున్నారని ఆమె తెలిపారు. ఏదేమైనా పిల్లల పెంపకం విషయంలో వారి మానసిక పరిస్థితిని కూడా అర్థం చేసుకోవలసిన అవసరం తల్లిదండ్రులకు ఉందని తాజా అధ్యయనం సూచిస్తోంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top