ప్రతి మనిషికి జీవితంలో ఎక్కువసార్లు వచ్చేఅతిసాధారణమైన జలుబును అశ్రద్ధ చేస్తే తీవ్ర అనారోగ్యానికి దారితీసే ప్రమాదం ఉంది.

వివిధ రకాల వైరస్‌ల ప్రభావం వల్ల జలుబు వస్తుంది. జలుబు రోజువారీ దైనందిన జీవనానికి ఆటంకంగా మారుతుంది. పిల్లలు స్కూలుకు వెళ్లకపోవటానికి, పెద్దలు వారి పనులకు వెళ్లక పోవటానికి జలుబు మొట్టమొదటి కారణమవుతుంది. ప్రతి మనిషికి జీవితంలో ఎక్కువసార్లు వచ్చేఅతిసాధారణమైన జలుబును అశ్రద్ధ చేస్తే తీవ్ర అనారోగ్యానికి దారితీసే ప్రమాదం ఉంది.

ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందే జలుబు అంటువ్యాధి. శరీరంలోరాజీపడుతున్న రోగనిరోధక వ్యవస్థకు తొలి సంకేతం ఈ జలుబు. 200 రకాలకు పైగా వైరస్‌ల ప్రభావం వల్ల వచ్చే జలుబుతో శ్వాసకోశ వ్యవస్థలో ఇబ్బందులు ఏర్పడతాయి. ముక్కు, సైనస్, టాన్సిల్స్, గొంతులో జలుబు లక్షణాలుంటాయి. వైరస్‌లు కలుషితమైన గాలి, నీటి ద్వారా వ్యాప్తి చెందటం సాధారణం. ఎలాంటి కారణం లేకుండానే జలుబు రావటం పలు రకాల సందేహాలకు దారితీస్తుంది. జలుబు అనారోగ్యం ఆరంభానికి సూచికలాంటిది.

లక్షణాలు
వైరస్‌ల ప్రభావం వల్ల రెండు నుంచి మూడు రోజుల్లోనే జలుబు వస్తుంది. తుమ్ములు రావటం, ముక్కు దిబ్బడ, ముక్కు మూసుకుపోవటం, ముక్కు కారటం, గొంతునొప్పి, గొంతు బొంగురు పోవటం, దగ్గు, కళ్లలో నీరు కారటం, జ్వరం, తలనొప్పి, కీళ్లనొప్పులు, సైనస్ ఇన్‌ఫెక్షన్, అలసట, ఆకలి మందగించటం లాంటివి జలుబు లక్షణాలు. జలుబు మొదట ముక్కు నుంచి నీళ్లలా కనిపించి, తర్వాత కఫంలోకి మారుతుంది. నాలుగు నుంచి 14 రోజుల వ్యవధిలోగా ఎలాంటి చికిత్స తీసుకోకుండానే సహజంగా తగ్గుముఖం పడుతుంది.  

అసలేం జరుగుతుంది?
జలుబుకు కారణమయ్యే వైరస్‌లు శ్వాసకోశ కణాలపై ప్రభావం చూపడం వల్ల తుమ్ములు, దగ్గు వంటి సహజ శరీర రక్షణ ప్రతిచర్యలు ఆరంభమవుతాయి. అయితే రోగిని కాపాడే ప్రతి చర్యే మిగిలిన వారికి ఇన్‌ఫెక్షన్‌ను అంటించే ఘటనగా పరిగణిస్తుంది. ఈ వైరస్‌లు శరీర రోగనిరోధక కణాలను ప్రమాదకర స్థాయిలో నాశనం చేస్తున్నపుడు రోగ నిరోధక వ్యవస్థ వీటిని ప్రతిచర్య ద్వారా శరీరం నుంచి బయటకు పంపుతుంది. ఈ చర్యల పర్యవసానంగా రకరకాల లక్షణాలు చూస్తుంటాం.

దుష్ప్రభావాలు
జలుబు నివారణకు చికిత్సతోపాటు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఉపేక్షిస్తే రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది. ఆస్తమా, అలర్జీ, డయాబెటీస్ వంటి వ్యాధులతో బాధపడే వారిలో వివిధ రకాల దుష్ప్రభావాలు ఏర్పడటానికి అవకాశముంది. ఈ జలుబు సైనస్ ఇన్‌ఫెక్షన్‌లు, ఆయాసం, చెవి ఇన్‌ఫెక్షన్‌లు, బ్రాంకైటీస్, టాన్సిల్స్‌కు కూడా కారణమవుతుంది. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు మరింత ప్రమాదకర పరిస్థితులను ఎదురుకావచ్చు.

వైద్యుల సలహా అవసరం
జలుబే కదా అని ఉపేక్షించటం లేదా తెలిసిన సొంత వైద్యం చేయటం అన్ని సమయాల్లో మంచిది కాదు. లక్షణాల ద్వారా నిర్ధారణ చేయటంతోపాటు అవసరాన్ని బట్టి రక్త పరీక్షలు, ఎక్స్‌రే వంటివి సమస్య అవగాహన కోసం తీయాల్సిన అవసరం పడవచ్చు. ఆయాసం వంటి ఊపిరితిత్తుల సమస్యలు మొదలవటం, 7 నుంచి 20 రోజుల కంటే ఎక్కువ సమయం జలుబు కొనసాగటం, సైనస్, చెవి ఇన్‌ఫెక్షన్‌ల వంటి దుష్ప్రభావాలు మొదలవటం వంటివి జరిగినపుడు తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో సంపూర్ణ చికిత్స తీసుకోవాలి.

జాగ్రత్తలు
జలుబు వచ్చిన వారు చేతులు శుభ్రంగా కడుక్కొని, నాణ్యమైన మందులు వాడాలి. సొంత వైద్యం చేయటం మానుకోవాలి. జలుబు సోకిన వారి వస్తువులను మిగిలిన వారు వాడకూడదు. శిశువులకు తల్లి పాలు ఇవ్వడం ద్వారా జలుబు, ఊపిరితిత్తుల సమస్యలు వంటి పలు అనారోగ్యాల బారిన పడకుండా ఉండవచ్చు. వ్యాయామం చేయటంతోపాటు సరైనంత నిద్ర పోవటం చాలా ముఖ్యం. సమతుల్యమైన పౌష్ఠికాహారం తీసుకోవాలి. ఇంట్లో తగినంత గాలి, వెలుతురు, సూర్యరశ్మి ఉండేలా చూసుకోవాలి.

హోమియో వైద్యం
వివిధ కారణాల వల్ల వచ్చే జలుబు సంబంధిత ఇన్‌ఫెక్షన్‌లకు హోమియో వైద్యం శాశ్వతమైన సమాధానాన్ని ఇస్తుంది. రోగాలకు గురయ్యే వారిలో జరిగిన సామూహిక మార్పులు, కారణాలను పరిశీలించటం ద్వారా చికిత్స చేస్తారు. దీనివల్ల హోమియో మందులు జలుబు ఇన్‌ఫెక్షన్‌లను సమూలంగా నిర్మూలించగలుగుతున్నాయి. అధిక ఆందోళన, ఒత్తిడి శరీరం తట్టుకోలేనంత ఉన్పప్పుడు రకరకాల రోగాలకు దారితీస్తుందని అధ్యయనంలో తేలింది. సరైన విషయపరిజ్ఞానంతో, జన్యుపరమైన మందులతో శాశ్వత చికిత్సతోపాటు నివారణ కూడా సాధ్యం హోమియో మందులకే సొంతం. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top