సాదారణంగా మనకు వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు

  • పన్ను నొప్పిగా ఉంటే గోరువెచ్చని నీటితో నోరు తరచూ పుక్కిలిస్తూ ఉండాలి. నోట్లో మిగిలిపోరుున ఆహారపదార్థాలు పోయేలా శుభ్రం చేసుకోవాలి.
  • కాళ్లు మెలికపడటం వల్ల వాస్తే... వాచిన చోట ఐస్ పెట్టాలి.స్ట్రైన్ అయిన కాలిని వీలైనంతగా కదిలించకుండా రెస్ట్ ఇవ్వాలి.
  •  ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంటే... చూపుడువేలు, బొటనవేలు సాయుంతో ముక్కు పై కాస్తంతే ఒత్తిడి పెట్టి ఓ పదినిమిషాలు గట్టిగా పట్టుకోవడం వల్ల రక్తస్రావం కట్టుబడుతుంది.
  • చెవిలో ఏదైనా దూరితే... టార్చిలైట్ చూపితే ఆ వెలుగుకు కీటకం ఏదైనా ఉంటే బయుటకు రావచ్చు. చెవిని నీటితో కడగాలి. చెవిలో నూనె వంటి పదార్థాలు వూత్రం అస్సలు వేయుకూడదు.
  • వాంతులు, విరేచనాలు అవుతుంటే శరీరం ద్రవపదార్థాలనూ, లవణాలను కోల్పోకుండా తగినన్ని కాస్తంత ఉప్పూ, చారెడు పంచదార కలిపిన నీళ్లు తాగాలి. కొబ్బరినీళ్లు, పప్పుపై ఉండే పల్చటి తేట తాగడం కూడా బాగానే పనిచేస్తుంది.
  • యూక్సిడెంట్ రోగులైతే... ప్రమాదం వల్ల అవుతున్న రక్తస్రావాన్ని ఆపేందుకు గుడ్డను అడ్డుగా పెట్టడం. రక్తం పోకుండా చూడటం ముఖ్యం.
  • కుక్క కరచిన సందర్భంలో నీళ్లను ఓ ప్రవాహంలా వదులుతూ సబ్బుతో గాయూన్ని కడగాలి.
  • కాలిన గాయూలైతే... వాటిపైనుంచి నీళ్లు ధారగా వెళ్లేలా 10 నిమిషాల పాటు చూడాలి. అలా నీళ్లు ప్రవాహంలా వేళ్లేలా చూస్తే కణజాలం (టిష్యూలు) వురింతగా చెడకుండా ఉంటారుు. అంతేకాదు... బొబ్బలను ఏవూత్రం చిదపకూడదు.
  • జ్వరంతో ఒళ్లు కాలిపోతుంటే... నుదుటిపై తడిగుడ్డ వేయాలి.
  • పాము కరచిన సందర్భంలో రోగికి తొలిసాయుంగా ఆత్మస్థైర్యం కలిగించడం ముఖ్యం. ఇక పాము కాటేసిన ఆ కాలు లేదా చేతిని వీలైనంతగా కదపకుండా చూడటం ముఖ్యం. కదలికలు ఎంత ఎక్కువగా ఉంటే విషం రక్తంలో కలిసే వేగం కూడా పెరుగుతుంది. కాబట్టి వీలైనంత ప్రశాంతంగా, కదలికలు లేకుండా చూడటం ముఖ్యం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top