బరువు తగ్గేందుకు....కొన్ని చిన్న చిన్న చిట్కాలు

బరువు తగ్గడానికి గంటల కొద్దీ వ్యాయామం చేయడం వల్ల సన్నబడడం సంగతి అటుంచి ఆరోగ్యపరమైన కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీని కన్నా వైద్యులు సూచిస్తున్న ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించి చూడండి..ఇవి సత్ఫలితాలు ఇవ్వగలవు.

- ఉదయం నిద్రలేచి దంతావధానం కానిచ్చిన తర్వాత వెన్న తీసిన పాలు ఓ గ్లాసుడు తాగండి. శరీరంలోకి కొత్త శక్తి వస్తుంది. మీ రోజువారీ పనులన్నీ చకచక చేసుకోగలరు.

- ఉదయం ఓ రెండు నిమిషాలు బస్కీలు తీయండి. ఈ వ్యాయామం వల్ల 21 క్యాలరీలు కరిగిపోతాయి. అంటే సంవత్సరానికి ఒక కిలో 300 గ్రాముల బరువు తగ్గుతారన్న మాట.

- బయటకు వెళ్లినపుడు మీ హ్యాండ్‌బ్యాగ్‌లో లీటరు మంచినీరు ఎప్పుడూ ఉంచుకోండి. రోజూ 20 నిమిషాల నడక 96 క్యాలరీలను ఖర్చు చేస్తుంది. నడక పూర్తయిన తర్వాత కడుపునిండా నీళ్లను తాగండి. నీరసంగా అనిపించదు.

- తినడం మానేసి డైటింగ్ చేసే కన్నా చక్కని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. వెన్నతీసిన పాలు, వెజిటబుల్ లేదా చికెన్ నూడుల్స్‌తో సూపు, క్యారెట్, బీట్‌రూట్, కీరా లాంటి పచ్చి కూరగాయలు, కూరగాయలతో జ్యూస్, ఆరెంజ్ జ్యూస్‌లు వంటివి ఎక్కువగా తీసుకోండి.



- కాఫీ తాగాలని అనిపిస్తే పాలు లేకుండా బ్లాక్ కాఫీ తాగండి. బ్లాక్ కాఫీలో 10 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కొవ్వు పదార్థాలేవీ ఉండవు. అదే పాలతో కలిపిన కాఫీ తాగితే 210 క్యాలరీలు, 11 గ్రాముల కొవ్వు శరీరంలో చేరుతుంది. రోజుకో కప్పు చొప్పున లెక్కవేస్తే ఏడాదికి 73వేల క్యాలరీలు ఒంట్లో చేరుతుందన్న మాట.

- భోజనం చేసేటప్పుడు ఒంటరిగానే తినడానికి ప్రయత్నించండి. ఒంటరిగా కన్నా ఫ్రెండ్స్‌తో కలిసి భోంచేస్తేనే ఎక్కువ తింటారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

- పండ్ల రసాలను నేరుగా తాగకూడదు. ఒక లీటరు ఆరెంజ్ జ్యూస్‌లో 360 క్యాలరీలు ఉంటాయి. అందువల్ల సగం గ్లాసులో ఫ్రూట్‌జ్యూస్ తీసుకుని అందులో సగం నీళ్లు కలిపి తాగాలి. దీని వల్ల సగం క్యాలరీలకు చెక్ పెట్టినట్లవుతుంది.

- భోజనం చేసే సమయంలో ముందు కొవ్వు అధికంగా ఉండే వంటకాలను ఆఖరున తినాలి. ముందు పచ్చి కూరగాయల ముక్కలు, ఆ తర్వాత చపాతీలు లేదా కొద్దిగా అన్నం తీసుకుని చివరిలో మాంసపదార్థాలను తినాలి. కడుపు నిండిన తర్వాత వాటి మీదకు ఎక్కువగా దృష్టి మళ్లకుండా ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top